ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఎక్కడ? దీపాల వెలుగులో వీరు కనిపించలేదేం?  

Tollywood Tollywood Stars Ram Charan Ntr Corona Virus India Lock Down - Telugu Corona Virus, India Lock Down, Ntr, Ram Charan, Tollywood, Tollywood Stars

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మనం అంతా ఒక్కటిగా కరోనాపై పోరాడుదాం, ఈ సమయంలో ఒకరికి ఒకరు సాయంగా నిలుద్దాం అనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ దీపాలు వెలిగించాలంటూ పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అత్యధికులు దీపాలు వెలిగించి వారి మద్దతును తెలియజేశారు.

 Tollywood Tollywood Stars Ram Charan Ntr Corona Virus India Lock Down

ఈ సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కరోనాపై పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు.

ఈ సమయంలో టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఎంతో మంది ఈ దీపాల కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రముఖులు పలువురు దీపాలు వెలిగించి తమ మద్దతును ప్రకటించారు.అయితే ఈ సమయంలో కొందరు మిస్‌ అవ్వడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఎక్కడ దీపాల వెలుగులో వీరు కనిపించలేదేం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

జనతా కర్ఫ్యూ సందర్బంగా గంట భజాయించిన వారు దాదాపుగా అంతా కూడా దీపాలు పట్టుకున్నారు.కాని వారిలో ఎన్టీఆర్‌ ఇంకా రామ్‌ చరణ్‌ మాత్రం దీపాలు పట్టుకున్న వారిలో కనిపించలేదు.

వారు పట్టుకున్నా ఫొటోలు తీయలేదా లేదంటే వారు అసలు దీపాలు పట్టుకోలేదా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.ఎందుకు కరోనాపై పోరాటంలో వీరిద్దరు ముందుకు రాలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

అనవసర రాద్దాంతం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.దీపాల వెలుగుల్లో వీరిని చూడలేక పోయినందుకు ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నుండి కమెడియన్స్‌ వరకు అంతా కూడా దాదాపుగా దీపాలు వెలిగించారు.చరణ్‌ భార్య ఉపాసన దీపంతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది.

కాని చరణ్‌ మాత్రం అక్కడ లేడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..