టాలీవుడ్ ముగ్గురు డాన్సింగ్ స్టార్స్ ఫేవరేట్ హీరోయిన్

టాలీవుడ్ ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో బెస్ట్ డాన్సర్స్ అనిపించుకున్న స్టార్ హీరోలు ఎవరంటే వెంటనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చెబుతారు.ఈ స్టార్ హీరోలు ముగ్గురు తమ సినిమాలలో కచ్చితంగా బెస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని సాంగ్స్ కోసం ఇస్తారు.

 Tollywood Dancing Stars Favorite Actress Sai Pallavi, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

ఇక ఈ హీరోల నుంచి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా డాన్స్ ని ఆశిస్తూ ఉంటారు.అందుకు తగ్గట్లే వారు సినిమాలో ఒక మాస్ బీట్ ని ప్లాన్ చేసుకోవడం చేస్తారు.

ఇంత మంచి డాన్సర్స్ గా పేరున్న ఈ ముగ్గురు స్టార్ హీరోల మనసుని ఒకే ఒక భామ దోచేసింది.వారికి ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఆమె సాయి పల్లవి

ప్రస్తుతం హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ అంటే అందరూ ముందుగా సాయి పల్లవి పేరు చెబుతారు.ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ డాన్స్ తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది.

బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడంతో పాటు బెస్ట్ యాక్టర్ కూడా అనిపించుకుంది.డీ షో చేసే సమయంలోనే అప్పటి జడ్జ్ ల నుంచి ఎప్పటికైనా మంచి హీరోయిన్ అవుతావు అని ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి హీరోయిన్ అయిన తర్వాత ఎవరికీ సాధ్యం కాని విధంగా తన పాటలతో యుట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఆమె రౌడీ బేబీ సాంగ్ చాలా మంది సాయి పల్లవి కోసమే చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.గతంలో సినిమా ఫ్యాక్షన్లో అల్లు అర్జున్ సాయి పల్లవి డాన్స్, పెర్ఫార్మెన్స్ ని ఆకాశానికి ఎత్తేసి ఆమెతో డాన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్న అని ప్రశంసించారు.

ఎన్టీఆర్ కూడా ఓకే సినిమా ఫంక్షన్ లో సాయి పల్లవి డాన్స్ గురించి పొగడంతో పాటు ఫేవరేట్ యాక్టర్ అని చెప్పేసాడు.ఇప్పుడు రామ్ చరణ్ కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ యాక్టర్ అంటూ సాయిపల్లవి అని చెప్పేసాడు.

మొత్తానికి ముగ్గురు బెస్ట్ డాన్సర్స్ కి ఫేవరేట్ యాక్టర్ గా సాయి పల్లవి మారడం నిజంగా ఆమెకి అరుదైన గౌరవం అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube