వెబ్ సిరీస్ ల జపం చేస్తున్న క్రిష్... ఇప్పుడు హాట్ స్టార్ కోసం

గమ్యం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వేదం సినిమాతో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న టాలెంట్ దర్శకుడు క్రిష్.రెగ్యులర్ కమర్షియల్ జోనర్ లో కాకుండా కంటెంట్ బేస్ మీద సినిమాలు తీసే క్రిష్ తో ఒక్క సినిమా అయిన చేయాలని హీరోలు అందరూ చూస్తూ ఉండేవారు.

 Director Krish Signed For Web Series In Hotstar, Tollywood, Telugu Cinema, Socia-TeluguStop.com

కెరియర్ భాగున్న సమయంలోనే ఎన్టీఆర్ బయోపిక్ తీసి ఒక్కసారిగా ఇమేజ్ మొత్తం నాశనం చేసుకున్నాడు.దర్శకుడుగా క్రిష్ సినిమాని తన స్టైల్ లో భాగానే తెరకెక్కించిన ఆ కథలో దమ్ము లేకపోవడం, అలాగే ఎన్టీఆర్ కథలో కీలక ఘట్టాలు పక్కన పెట్టడంతో సినిమా ప్రేక్షకులకి నచ్చలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పీరియాడికల్ స్టొరీతో సినిమా ప్లాన్ చేసిన క్రిష్ మరో వైపు ఓటీటీ ప్లాట్ ఫాం మీద వెబ్ సిరీస్ లకి కథలు అందించే పనిలో ఉన్నాడు.గమ్యం సినిమా తర్వాత సీరియల్స్ కి కథలు అందించిన, సొంత ప్రొడక్షన్ లో సీరియల్స్ నిర్మించిన క్రిష్ ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెట్టాడు.

ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా కోసం వెబ్ సిరీస్ లు తెరకేక్కిస్తున్నాడు.దీంతో పాటు తాజాగా హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ తీయడం కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఓటీటీ ప్లాట్ ఫాం లో వెబ్ సిరీస్ లు అంటే ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తో వస్తున్నావే మరి ఇలాంటి కంటెంట్ ని క్రిష్ లాంటి సాఫ్ట్ దర్శకుడు ఎలా డీల్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఓ వైపు వెబ్ సిరీస్ లకి కథలు అందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమా మీద ఎంత వరకు ఫోకస్ పెడతాడు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది.

మరి వీటికి క్రిష్ ఎలా సమాధానం చెబుతాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube