మరో రెండు వారాలు ఎదురు చూడక తప్పదా?

తెలుగు సినిమా పరిశ్రమలో జూన్‌ మొదటి వారం నుండి షూటింగ్స్‌ సందడి ప్రారంభం అవుతుందని అంతా భావించారు.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిందే అని అనుకున్నారు.

 Another Two Weeks Are Should Waiting For Cinima Shootings In Telangana, Tollywoo-TeluguStop.com

ఆమద్య సినీ ప్రముఖుతో తెలంగాణా సిఎం భేటీ అయ్యి షూటింగ్స్‌కు అనుమతిస్తామంటూ ప్రకటించాడు.కాని అది మరికొంత ఆలస్యం అవ్వబోతుందని తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించాడు.

షూటింగ్స్‌కు అనుమతి విషయంలో ప్రభుత్వం మరో అడుగు వెనక్కు వేసింది.కొన్ని వారాల క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కొన్ని రోజులు ఓపిక పట్టండి.

అన్ని సర్ధుకుంటాయి.జూన్‌ మొదటి వారం నుండి హాయిగా షూటింగ్స్‌ చేసుకోవచ్చు అన్నాడు.

కాని తాజాగా మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయిన తర్వాత మరో రెండు వారాలు వెయిట్‌ చేయాల్సిందిగా సూచించినట్లుగా సమాచారం అందుతోంది.అధికారికంగా అయితే ప్రకటన రాలేదు.

కాని జూన్‌ మూడవ వారం వరకు షూటింగ్స్‌ చేసుకోవాలంటే ఆగాల్సిందే అని తేలిపోయింది.

-Movie

ఇప్పటికే లాక్‌ డౌన్‌ కారణంగా రెండు నెలలుగా షూటింగ్స్‌ అన్ని బంద్‌ ఉన్నాయి.దాంతో సినీ కార్మికులు దాదాపు 14 వేల మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు.కనీస అవసరాలు కూడా కొనుగోలు చేయలేక కన్నీరు పెట్టుకుంటున్నారు.

కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది.దాంతో బాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌ కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే.

స్టూడియోలు అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం షూటింగ్స్‌కు ఇంకా అనుమతులు ఇవ్వడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube