ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “సూపర్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై టాలీవుడ్ స్వీటీ గా గుర్తింపు తెచ్చుకున్న “మంగుళూరు బ్యూటీ అనుష్క శెట్టి” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అనుష్క శెట్టి సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో కొంతమేర అవకాశాలు దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ వచ్చిన అవకాశాలని సక్రమంగా వినియోగించుకుని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ కి స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది.

 Anushka Shetty Childhood Photos Viral,anushka Shetty, Telugu Heroine, Tollywood-TeluguStop.com

అయితే తాజాగా స్వీటీ అనుష్క కి సంబంధించినటువంటి చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.దీంతో స్వీటీ అనుష్క అభిమానులు ఈ ఫోటో గురించి స్పందిస్తూ చిన్నప్పుడు అనుష్క శెట్టి చాలా ముద్దుగా ఉందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

 అంతేగాక ఈ ఫోటోని షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న “నిశ్శబ్దం” అనే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావడంతో విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube