అలాంటి సన్నివేశాలలో నటించానని నన్ను నా భర్త ఏకంగా అలా ...

తెలుగు చిత్రాలలో అక్క, వదిన, చెల్లి, తదితర పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె పలు సెంటిమెంట్ పాత్రలోనే కాకుండా బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలను కూడా పోషించి బాగానే ఆకట్టుకుంది.

 Uma Devi, Tollywood Supporting Character Artist, Bold And Wamp Characters, Tolly-TeluguStop.com

అయితే ఇటీవలే నటి ఉమా దేవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా కాగా తన సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ మీరు ఒకప్పుడు కొంతమేర బి గ్రేడ్ తరహా చిత్రాలలో నటించిన సన్నివేశాలను మీ బంధువులు లేదా సన్నిహితులు చూసి ఎలా స్పందించారని అంటూ అడిగింది.దీంతో ఉమా దేవి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఒకసారి తన భర్త తాను ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి సై చిత్రంలో నటించిన ఓ సన్నివేశం చూసి నువ్వు ఇలాంటి సన్నివేషాలలో నటించావా.? అని అడిగాడని చెప్పుకొచ్చింది.

దీంతో తాను కూడా అప్పట్లో నటించానని ప్రస్తుతం అలాంటి పాత్రలలో నటించడం లేదని తన భర్తతో చెప్పిందట.అంతేగాక తన వ్యాపార వేత్త కావడంతో సినిమాలు తక్కువగా చూస్తాడని అందువల్లే తన పాత్రల గురించి తన భర్తకి తెలియదని, అయితే ఈ సంఘటన వల్ల ఆరోజు తన భర్త కొంతమేర బాధ పడినప్పటికీ ఆ తర్వాత తాను సినీ జీవితం మరియు అవకాశాల గురించి తన భర్త కి వివరించడంతో అర్థం చేసుకొని ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

అయితే ఉమాదేవి తెలుగులో  నటించిన సారీ ఆంటీ, సై, నేను, ఖతర్నాక్, పార్టీ, అత్తిలి సత్తిబాబు తదితర చిత్రాలు ప్రేక్షకులు బాగానే ఆకట్టుకున్నయి.అయితే అప్పట్లో తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ జీ తెలుగులో ప్రసారమయ్యే వరూధిని పరిణయం అనే సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

 ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో భాగ్యం అనే మహిళా పాత్రలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube