అతిలోక సుందరి శ్రీదేవి( Actress Sridevi ) ఆమె ఎన్ని భాషలలో సినిమాలు తీసిన మన తెలుగమ్మాయి గానే గుర్తింపు పొందింది.బాలీవుడ్ లో పాగా వేసిన కూడా శ్రీదేవికి సైతం తెలుగు సినిమాలు అంటేనే మక్కువ ఎక్కువ.
లేటు వయసులో కూడా నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల సరసన సినిమాలో నటించింది.అలాగే ఇప్పుడు శ్రీదేవి అయితే ఈ లోకంలో లేకపోయినా ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా మన తెలుగు అమ్మాయి అని అందరూ బాగా ఓన్ చేసుకుంటున్నారు.
చాలా రోజులుగా జాన్వి కపూర్( Janhvi Kapoor ) తెలుగు సినిమాల్లో బిజీ అవ్వాలని ఎంతోమంది కోరుకున్న ఇన్నాళ్ల వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేని ఈ టైం లో జాన్వీ కపూర్ తెలుగు మరియు తమిళ భాషల్లో క్రేజీ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.

తెలుగు సినిమాల విషయానికొస్తే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమా( Devara Movie ) కోసం నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నటిస్తూనే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం జాన్వి కపూర్ ని ఫైనల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.అంతేకాదు పుష్ప సీక్వెల్( Pushpa Sequel ) చిత్రంలో సమంత తో పాటు జాన్వీ కపూర్ కూడా ఒక ఐటమ్ సాంగ్ కోసం తన కాలు కదపనుంది.తెలుగులో ఇలా వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూనే మరోవైపు తమిళ సినిమా ఇండస్ట్రీపై కూడా జాన్వీ కపూర్ తన ఫోకస్ మొదలుపెట్టింది.
ఇప్పటికే సూర్య హీరోగా వస్తున్న కర్ణ చిత్రం లో ఆమెను లీడ్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇలా మన తెలుగు అమ్మాయి కాబట్టి మన తెలుగు సినిమాల్లో వరస అవకాశాలు ఇస్తున్నారు.బాలీవుడ్ ఆమెకు హ్యాండ్ ఇచ్చిన ఈ టైం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ జాన్వీ నీ ఆదుకుంటుంది.ఎంతైనా మన శ్రీదేవి కూతురు కాబట్టి మనకు ఆ జాగ్రత్త ఉండటం, ప్రేమ ఉండడం సహజమే.
ఇక జాన్వి సైతం ఏదో తల్లి చాటు బిడ్డగా కాకుండా తనలో ఉన్న టాలెంట్, నటన, అందం అన్ని సాన పడుతోంది.ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood Film Industry )ని ఏలెయ్యడం ఖాయం.
అంతేకాదు హీరోయిన్స్ కొరత ఉన్న ఈ టైంలో ఆమె సౌత్ ఇండియాకి ఎంట్రీ ఇవ్వడం కూడా జాన్వి కపూర్ కి కలిసి వచ్చింది.