Tollywood Movie Stories : అయితే దేవుడు లేదంటే దయ్యం…టాలీవుడ్ మొత్తం వీటి చుట్టే !

దేవుడు ఉన్నట్టే దయ్యం కూడా ఉంటుంది అనేది చాలామంది విశ్వాసం.అందుకే దేవుడి పైన నమ్మకంతో సినిమాలు తీసినట్టే దయ్యంపై కూడా అంతే నమ్మకంతో మన తెలుగు సినిమా దర్శకులు తమ చిత్రాలను తీస్తూ వస్తున్నారు.

 Tollywood Stories Based On Devotional And Ghost-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సినిమాలు మొత్తం కూడా దేవుడు లేదా దయ్యం కాన్సెప్టు తోనే తెరకెక్కుతున్నాయి.గతంలో దేవుళ్ళ పేరుతో కాసుల వర్షం కురిసింది.

ఇప్పుడు అదే పరిస్థితి దయ్యాలకు వచ్చింది.ఈ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలకు కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

మరి దేవుడు వర్సెస్ దయ్యం ట్రెండ్ తో వస్తున్న ఆ సినిమాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Gitanjali, Kalki, Karthikeya, Masudha, Tollywood, Virupaksha-Telugu Top P

సంక్రాంతి పండుగకు మొన్ననే హనుమాన్ పేరుతో తేజ సజ్జ ఒక డివోషనల్ సినిమా తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఏకంగా 300 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ఈ చిత్రం.దీనికన్నా ముందు కృష్ణుడు కాన్సెప్ట్ తో వచ్చిన కార్తికేయ 2( Karthikeya 2 ) కూడా మంచి హిట్ అయింది అలాగే అఖండ కూడా శివుడు పేరుతో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Gitanjali, Kalki, Karthikeya, Masudha, Tollywood, Virupaksha-Telugu Top P

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా ఇలాంటి చాలా అంశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.అలాగే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా హనుమాన్ ( hanuman )ఎలిమెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.అలాగే మహాభారతం నుంచి కథ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ప్రభాస్ నటిస్తున్న కల్కి( Kalki ) చిత్రం.ఇక శివుడిని హైలెట్ చేస్తున్నాడు మన గోపీచంద్ తన బీమా చిత్రంలో.

Telugu Gitanjali, Kalki, Karthikeya, Masudha, Tollywood, Virupaksha-Telugu Top P

ఇక దయ్యం కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాల విషయానికొస్తే ఇటీవల విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2 కూడా చేతబడి అనే అంశంతో తెరకెక్కి విజయాన్ని అందుకున్నాయి.మసుధా చిత్రం కూడా పూర్తిగా చేతబడుల నేపథ్యంలోని తెరకెక్కి విజయం సాధించడం విశేషం.అంతే కాదు గీతాంజలి ( Gitanjali )మళ్లీ వచ్చింది అనే చిత్రం కూడా దయ్యం కథ నేపథ్యంలోకెక్కుతుండగా ఆశిష్ రెడ్డి లవ్ మీ అనే సినిమాలోనూ గోస్ట్ కథనే ఆధారంగా తీసుకున్నాడట.ఇలా చూస్తూ వెళితే దయ్యాల కథలు దేవుళ్ళ కథలు ఎక్కువగా భవిష్యత్తులో కూడా రాబోతున్నాయి.

ఎందుకంటే వాటికి సీక్వెల్స్ కూడా తెరకెక్కిస్తున్నారు కాబట్టి.మా ఊరి పొలిమేర 3, మసుధా 2, విరూపాక్ష 2( ma vuri Polimera 3, Masudha 2, Virupaksha 2 ) కూడా తెరకెక్కుతుంది.

ఇవి కాకుండా అఖండ 2, కార్తికేయ 2, జై హనుమాన్ వంటి సీక్వెల్స్ కూడా దేవుల్ల నేపద్యంలో రానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube