ఒకే ట్రెండ్ ఫాలో అవుతున్న సినీ సెలబ్రిటీలు.. అదే పెట్ డాగ్ తో జెట్ ఫ్లైట్ ఫ్రెండ్షిప్?

శునకం అంటే విశ్వాసానికి మారుపేరు.ఇక ఇప్పుడు ఆ శునకం ప్రతి ఇంట్లో ఒక భాగంగా మారిపోయింది.

 Tollywood Stars With Their Pets In Private Jets Keerthy Suresh Ram Charan Rashmika Akhil Details, Celebrities Pet Dogs, Pet Dogs Jet Flight, Tollywood Celebrities, Keerthy Suresh, Ram Charan, Akhil Akkineni, Rashmika Mandanna, Vijay Devarakonda,-TeluguStop.com

కాదు ఏకంగా ప్రతి ఇంటి మనిషిగా మారిపోయింది అని చెప్పాలి.ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము పెంచుకునే కుక్కలపై మనుషుల మీద కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.

కేవలం సామాన్యుల మాత్రమే కాదండోయ్ సెలబ్రిటీలు సైతం కుక్కలతో బంధం పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.నచ్చిన పెట్ డాగ్స్ తెచ్చుకుని ఎంతో ప్రేమగా చూసుకోవడం.

 Tollywood Stars With Their Pets In Private Jets Keerthy Suresh Ram Charan Rashmika Akhil Details, Celebrities Pet Dogs, Pet Dogs Jet Flight, Tollywood Celebrities, Keerthy Suresh, Ram Charan, Akhil Akkineni, Rashmika Mandanna, Vijay Devarakonda, -ఒకే ట్రెండ్ ఫాలో అవుతున్న సినీ సెలబ్రిటీలు.. అదే పెట్ డాగ్ తో జెట్ ఫ్లైట్ ఫ్రెండ్షిప్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఖాళీ సమయం దొరికితే డాగ్స్ తోనే సమయం గడపడం లాంటివి చేస్తున్నారు.

అయితే మనుషులు కుక్కల మధ్య ఎలాంటి అనుబంధం పెరిగిపోయింది అన్న విషయాన్ని చెప్పేందుకు ఇటీవలే చార్లీ 777 సినిమా వచ్చి మంచి విజయం సాధించింది.

డాగ్ ప్రేమికులందరికీ సినిమా కన్నీళ్లు తెప్పించింది అని చెప్పాలి.అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు హీరోయిన్లు సైతం తమ పెట్ డాగ్స్ ను విడిచి పెట్టడం లేదు.

ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పక్కన డాగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు.ప్రైవేట్ ఫ్లైట్ లో డబ్బులు ఖర్చు పెట్టి మరి డాగ్స్ కోసం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసుకొని మరీ తమతోపాటు తమ ప్రియమైన కుక్కలను తీసుకెళ్తున్నారు అని చెప్పాలి.

మొన్నటికి మొన్న త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాను ఎక్కడికి వెళితే అక్కడికి ఎంతో ఇష్టమైన కుక్కను తీసుకు వెళ్ళాడు.ఇక అక్కినేని హీరో అఖిల్ సైతం తన పెట్ డాగ్ తో ఫోటోకి ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

Telugu Akhil Akkineni, Pet Dogs, Keerthy Suresh, Pet Dogs Jet, Ram Charan, Stars Pets, Tollywood-Latest News - Telugu

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నేటితరం మహానటి కీర్తి సురేష్ సైతం తనకు ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ తో చార్టెడ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసింది.కీర్తి సురేష్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.అంతేకాదండోయ్ కీర్తి సురేష్ తన డాగ్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేయడం గమనార్హం.జంతు ప్రేమికురాలు అయిన రష్మిక మందన కూడా ఎన్నో పెట్ డాగ్స్ పెంచుకుంటూ ఉంటుంది.

Telugu Akhil Akkineni, Pet Dogs, Keerthy Suresh, Pet Dogs Jet, Ram Charan, Stars Pets, Tollywood-Latest News - Telugu

ఇక మొన్నటికి మొన్న చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం తనకు ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ నీ వెంట తీసుకెళ్లడమే కాదు ఇక ఖాళీ సమయం మొత్తం ఆ డాగ్ తోనే గడపడం గమనార్హం.ఏదేమైనా నేటి రోజుల్లో సినీ సెలబ్రిటీలు అందరూ ట్రెండ్ కోసం డాగ్స్ ను పెంచుకోవడమే కాదు.వాటితో ప్రత్యేకమైన బాండింగ్ కూడా ఏర్పరచుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube