ఇండియన్ టాప్ డైరెక్టర్ల లిస్టులో టాప్ లో ఉంటాడు తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.తను ఇప్పటి వరకు తీసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ సాధించాయి.ఏ సినిమా కూడా యావరేజ్ గా ఆడలేదు.అందుకే తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు.కళ్లుమూసుకుని ఓకే చెప్తారు.విచిత్రం ఏంటంటే రాజమౌళి కావాలని కొందరి నటులను తమ సినిమాలో నటించాలని కోరినా.
సదరు యార్టర్లు నో చెప్పారట.ఆ తర్వాత ఆయా సినిమాలు రిలీజ్ అయ్యాక.
ఎందుకు ఇంత మంచి ఛాన్స్ వదులుకున్నామా? అని బాధపడ్డారట.ఇంతకీ రాజమౌళి ఆఫర్ కాదన్న నటులు ఎవరు? వదులుకున్న క్యారెక్టర్లు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
శ్రీదేవి
బాహుబలి సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ శివగామి.ఈ పాత్రలో నటించాలని రాజమౌళి తొలుత శ్రీదేవిని కోరాడట.అందుకు తను చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట.దాంతో ఆ పాత్రను రమ్య కృష్ణ చేత చేయించారట.
వివేక్ ఒబేరాయ్
బాహుబలి సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ భల్లాలదేవ.రానా చేసిన ఈ పాత్రను చేయాల్సిందిగా మొదట వివేక్ ఒబేరాయ్ ని కోరాడట.డేట్స్ ఖాళీగా లేని కారణంగా ఈ సినిమాలో చేయలేనని చెప్పాడట.చివరకు ఈ అవకాశం రానాకు వచ్చింది.
సోనమ్ కపూర్
బాహుబలి సినిమాలో అవంతిక పాత్రను చేయాల్సిందిగా సోనమ్ కపూర్ ను సంప్రదించాడట రాజమౌళి.అయితే అనివార్య కారణాల వల్ల తను ఈ సినిమా చేయలేనని చెప్పిందట.వెంటనే తమన్నాకు ఈ అవకాశం ఇచ్చిండ జక్కన్న.
ప్రభాస్
జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి.ఈ సినిమాను మొదట ప్రభాస్ చేత చేయించాలని రాజమౌళి అనుకున్నాడట.కానీ రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెం.1 ప్రభాస్ కు అంతగా నచ్చలేదట.దీంతో ఈ సినిమాను చేయలేనని చెప్పాటడట.