మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంది.కానీ గత కొన్నేళ్లు వెనక్కి వెళితే చెన్నైలోనే( Chennai ) పరిశ్రమ ఉండేది.
ఎవరి సినిమా షూటింగ్ చేయాలన్నా చెన్నైకి వెళ్లి వచ్చేవారు.ఆ తర్వాత కొన్ని రోజులకు పరిస్థితులు మారాయి.
మన తెలుగులో కూడా సినిమాలు తీయడానికి ఇక్కడి వారు వెల్కమ్ చేయగా ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది.అయితే ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది చెన్నైలోనే పుట్టి, చెన్నైలోనే పెరిగి చదువులు కూడా చెన్నైలోనే పూర్తి చేశారు.
ఈ స్టార్ హీరోలంతా తెలుగు ఎంత బాగా మాట్లాడగలరో అంతే బాగా తమిళ్ కూడా మాట్లాడతారు.దాంతో వీరు సగం తెలుగు సగం తమిళ్ అన్న విధంగా ఉంది పరిస్థితి.
ఇంతకీ తమిళ్ నాడు లో పుట్టిన మన స్టార్ హీరోలు ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు( Mahesh Babu ) చెన్నైలోనే పుట్టారు.ఆయన చదువులు మొత్తం అక్కడే చదివాడు కూడా.అయితే తమిళ్ చాలా బాగా మాట్లాడే మహేష్ బాబు ఏ భాషను సరిగ్గా రాయలేడు.ఆయన కేవలం ఇంగ్లీష్ మాత్రమే రాయగలరు.ఇక చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) కూడా తమిళనాడులోనే పుట్టాడు.
చెన్నైలోనే పెరిగాడు.అక్కడ కొన్నాళ్ల పాటు చదువుకున్నాడు కూడా.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన రామ్ చరణ్ తెలుగు, తమిళ్ చాలా బాగా మాట్లాడుతూ, రాయగలడు కూడా.
ప్రభాస్( Prabhas ) సైతం చెన్నైలోనే పుట్టి పెరిగాడు.ప్రభాస్ హిందీ మాట్లాడలేడు కానీ తమిళ్ చాలా బాగా మాట్లాడుతాడు.ఇక అల్లు అర్జున్( Allu Arjun ) చెన్నైలోనే పుట్టి పెరిగాడు.
తెలుగు, తమిళ్ అనర్గళంగా మాట్లాడుతాడు.ఇటీవల మలయాళం కూడా బాగానే మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్.
వీరితో పాటు అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) సైతం చెన్నైలోనే పుట్టి పెరిగాడు.తన తల్లి అక్కడే ఉండడంతో పూర్తి చదువులను కూడా తల్లితో పాటే చెన్నైలోనే ఉంటూ పూర్తి చేశాడు.
దగ్గుబాటి రానా( Daggubati Rana ) సైతం తమిళనాడు లో పుట్టి చెన్నైలోనే తన చదువులను పూర్తి చేసుకున్నాడు.ఇలా మన హీరోలంతా కూడా తెలుగు, తమిళ్ పర్ఫెక్ట్ గా మాట్లాడగలరు.