కొందరు హీరో, హీరోయిన్ పెయిర్ స్క్రీన్ మీద చూడ్డానికి చక్కగా కనిపిస్తాయి.ఈ జంటలు తెరమీద ఎంత రొమాన్స్ చేసినా.
ఆఫ్ స్ర్కీన్ లో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ లా కొనసాగుతున్నారు.కొంచెం క్లోజ్ గా ఉంటే ఇద్దరికీ లింక్ పెట్టే గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ కూడా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటెన్ చేస్తూ వచ్చారు కొందరు హీరో, హీరోయిన్లు.అందులో చిరంజీవి దగ్గర నుంచి నాని వరకు కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న హీరో-హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి- రాధిక
వీరిద్దరు చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేశారు.మంచి విజయాలు అందుకున్నారు.ఇప్పటికీ వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.
నాగార్జున- టబు
వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నాటి నుంచి నేటి వరకు గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.కానీ వాటిని వీరిద్దరు ఎప్పుడూ పట్టించుకోలేదు.ఇద్దరు ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు.
బాలక్రిష్ణ- రోజా
వీళ్లిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు.ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు.పార్టీ పరంగా మాటలు అనుకున్నా.ఇద్దరు మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారు.
రామ్ చరణ్- కాజల్
వీరిద్దరు కలిసి 4 సినిమాలు చేశారు.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది.
రామ్- జెనీలియా
వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఒకటే అయినా.మంచి ఫ్రెండ్స్ అయ్యారు.రామ్ ముంబై వెళ్తే వీరింటికే వెళ్తాడు.జెనీలియా హైదరాబాద్ కు వస్తే రామ్ ఇంటి దగ్గరే ఉంటుంది.
బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్ అగర్వాల్
ఇద్దరు కలిసి నటించిన సినిమా సీత.అప్పటి నుంచి వీరిద్దరు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు.
నాని- నివేదితా థామస్
నానితో పలు సినిమాలు చేసిన నివేదితా అప్పటిని నుంచి స్నేహంగా మెలుగుతున్నారు.ఇద్దరు రోజుకు ఒకసారైనా పలకరించుకుంటారట.
ప్రభాస్- అనుష్క
వీరిద్దరు కలిసి పలు సినిమాలు చేశారు.వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.అయితే వాటిని కొట్టిపారేశారు.వీరిద్దరు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు.
సాయి ధరమే తేజ్- రాశీ ఖన్నా
వీరిద్దరు సినిమాల్లో టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకున్నా.బయట మాత్రం మంచి ఫ్రెండ్స్ లా కొనసాగుతున్నారు.
నాని- కీర్తి సురేష్
నేను లోకల్ సినిమాతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.అది అలాగే కొనసాగుతుంది.