బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌  

Tollywood Stars Strict With There Remmunaration, Coronavirus, Lock Down, Tollywood Stars, Remmunaration, Producers - Telugu Coronavirus, Lock Down, Producers, Remmunaration, Tollywood Stars

కరోనా కారణంగా సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది, ఇంకా పోతూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరు ఏడు నెలలకు ముందు పచ్చగా కలకలలాడుతూ ఉన్న సినిమా పరిశ్రమ ఇలా ఒక్కసారిగా మారిపోవడం దారుణంగా ఉంది.

TeluguStop.com - Tollywood Stars Strict With There Remmunaration

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

రెండు నెలలు మొత్తం షట్‌ డౌన్‌ చేయడం జరిగింది.ఆ సమయంలో సినీ కార్మికులు ఆకలితో అలమటించారు.

TeluguStop.com - బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టాలీవుడ్‌ స్టార్స్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ కరోనా కారణంగా నిర్మాతలు వందల కోట్లు నష్టపోయారు.కేవలం ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ 2500 కోట్లు నష్టపోయి ఉంటారు అనేది ఒక అంచనా.

అంతగా నిర్మాతలు నష్టపోవడం వల్ల వారిని ఆదుకునేందుకు హీరోలు దర్శకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కోట్ల పారితోషికాలు గతంలో ఇచ్చిన నిర్మాతలను ఆదుకోవాలనే కనీస విజ్ఞత ఉండాలి.

***

కాని ఈ సమయంలో కూడా పారితోషికం కోసం ముక్కు పిండుతున్న వారు టాలీవుడ్‌ లో ఉన్నారు అంటే ఆశ్చర్యం అక్కర్లేదు.

టాలీవుడ్‌లోని పలువురు హీరోలు హీరోయిన్స్‌ పారితోషికం విషయంలో చేస్తున్న హడావుడి గురించి మాట్లాడితే ఛీ మరీ ఇలా ఉన్నారా అనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో వారి గురించి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.ఒక ప్రముఖ నిర్మాత వద్ద ఒక హీరోకు పారితోషికం రావాల్సి ఉంది.

వారు ఇద్దరు చేసిన సినిమా కొన్ని కారణాల వల్ల మద్యలో ఆగిపోయింది.ఇప్పుడు ఆ హీరో బ్యాలన్స్‌ వర్క్‌ పూర్తి చేసేందుకు రమ్మంటే తాను ఇచ్చిన డేట్లు పూర్తి అయ్యాయి.

పారితోషికం అదనంగా ఇస్తే వస్తానంటూ పేచి పెడుతున్నాడట.ఇప్పటికే సినిమాకు భారీ మొత్తం పెట్టి నష్టపోయిన ఆ నిర్మాత ఇప్పుడు హీరో ఎక్కువ పారితోషికం అడుగుతున్న నేపథ్యంలో అసలు సినిమాను మద్యలో వదిలేద్దామా అనుకుంటున్నాడట.

హీరోలు మరీ అంత కఠినంగా ఉండటం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది.

వారి నుండి పారితోషికం విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది.కాని కొందరు మాత్రం వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందంటూ నిర్మాతలు అంటున్నారు.

హీరోయిన్స్‌ కూడా ఇందుకు అతీతం కాదు.ఈ సమయంలో కూడా పారితోషికాలు పెంచేస్తున్నారు.

#Coronavirus #Remmunaration #Lock Down #Producers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Stars Strict With There Remmunaration Related Telugu News,Photos/Pics,Images..