గ్లోబల్ స్టార్స్ గా టాలీవుడ్ హీరోస్.. అదిరిపోయే రెమ్యునరేషన్

రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగింది.ఈ సినిమా లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పింది.

 Tollywood Stars Remuneration In Global Range , Tollywood Heros , Rajamouli , Bh-TeluguStop.com

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ మూవీస్ అద్భుత రీతిలో రెడీ అవుతున్నాయి.బాలీవుడ్ ను తలదన్నే రీతిలో తెలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

ఒకప్పుడు సౌత్ స్టార్లుగా పిలిపించుకునే మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా వెలుగొందుతున్నారు.సినిమాల్లో కథలు, సినిమా విలువ, నటీనటుల రెమ్యునరేషన్ అన్నీంటిలోనూ బాలీవుడ్ కా బాప్ లా తయారైంది పరిస్థితి.

తెలుగు స్టార్లలో ప్రభాస్, అల్లూ అర్జున్, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, మహేష్‌ బాబు గ్లోబల్ స్టార్‌ల కేటగిరీలోకి అడుగు పెట్టారు.

Telugu Allu Arjun, Bhahubali, Jr Ntr, Mahesh Babu, Prabas, Puspa, Rajamouli, Ram

ఈ ఐదుగురు టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమా చేయడానికి ఇప్పటికే రూ.50 కోట్లు తీసుకుంటున్నారు.అల్లు అర్జున్ అంతకు ముందు సుమారు రూ.10 కోట్లు తీసుకునేవాడు.కానీ పుష్ప సినిమా కోసం ఏకంగా 50 కోట్లు అందుకున్నాడు.

ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఓ రేంజిలో విక్టరీ కొట్టింది.రూ.100 కోట్ల క్లబ్ లో చేరడంతో బన్నీ రేంజి బాగా పెరిగింది.పుష్ప -2 కోసం అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా కోసం రాంచరణ్, ఎన్టీఆర్ చెరో రూ.50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Bhahubali, Jr Ntr, Mahesh Babu, Prabas, Puspa, Rajamouli, Ram

అటు బాహుబలి ప్రభాస్ మిగతా హీరోల కంటే వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు.ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్. సందీప్ వంగా సినిమాకు ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.అటు మహేష్ బాబు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.ఒక్క పాన్ ఇండియన్ మూవీ చేయనప్పటికీ పారితోషకం మాత్రం బాగానే తీసుకుంటున్నాడు.ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు అందుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube