రాజధానిగా వైజాగ్‌ ఓకే అనుకుంటున్న టాలీవుడ్‌, కారణం ఇదేనా?  

Tollywood Stars Ok For Ap Capital In Vizag - Telugu Amaravthi Farmars Says Banned Tollywood Movie, Amaravthi Farmars Strike, Ap Capital Amaravathi, Telugu Movie News, Tollywood Stars

ఏపీలో రాజధాని విషయమై పెద్ద రగడ జరుగుతుంది.ఎప్పుడెప్పుడు రాజధానిని మార్చుదామా అని ఎదురు చూసిన వైకాపా ప్రభుత్వం తాజాగా అందుకు గాను పావులు కదుపుతోంది.

Tollywood Stars Ok For Ap Capital In Vizag

మరో వైపు అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.రాజధాని మార్చడంపై తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు.

ఖచ్చితంగా ప్రభుత్వం వైజాగ్‌కు రాజధాని మార్చే విషయమై ఆలోచనలో ఉండగా టాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం నోరు మెదపడం లేదు.

ఇటీవల అమరావతి రైతులు మాట్లాడుతూ టాలీవుడ్‌ స్టార్స్‌ మా బాధలపై స్పందించాలంటూ కోరారు.లేదంటే తెలుగు సినిమాలను ఏపీలో బ్యాన్‌ చేస్తామంటూ హెచ్చరించారు.అయినా కూడా ఏమాత్రం తెలుగు స్టార్స్‌ పట్టించుకోలేదు.

నారా రోహిత్‌ తప్ప అమరావతి రైతుల గురించి మాట్లాడిన తెలుగు సినిమా స్టార్స్‌ ఎవరు లేరు.ఎందుకు అమరావతికి వీరు మద్దతు ఇవ్వడం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో సినీ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది.

తెలుగు సినిమా ప్రముఖుల్లో చాలా మందికి వైజాగ్‌లో భూములు ఉన్నాయి.ఆ భూములకు విలువ పెరగాలనే ఉద్దేశ్యంతోనే వైజాగ్‌ను రాజధానిగా వారు కోరుకుంటున్నారు.వైజాగ్‌లో సినిమా పరిశ్రమ ఏర్పాటుకు జగన్‌ ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమ వారికి తక్కువ మొత్తానికే భూమిని కేటాయించబోతున్నారు.

అందుకే టాలీవుడ్‌ వారు వైజాగ్‌ను రాజధానిగా కోరుకుంటున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Stars Ok For Ap Capital In Vizag Related Telugu News,Photos/Pics,Images..

footer-test