విదేశాలకు వెళుతున్న టాలీవుడ్ స్టార్స్.. ఏ ప్రాంతాలకు ఎక్కువగా వెళుతున్నారంటే?

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయనే సంగతి తెలిసిందే.మన స్టార్ హీరోలలో చాలామంది షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి విదేశాలలో కొంతకాలం గడపటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Tollywood Stars In Foreign Locations Prabhas Pawan Kalyan Ntr Ram Charan Mahesh-TeluguStop.com

కొంతమంది హీరోలు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతుండగా కొంతమంది మాత్రం సోలోగా వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు.

సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటుండగా షూట్ పూర్తైన తర్వాత కూడా ప్రభాస్ కొంతకాలం విదేశాలకే పరిమితం కానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారని బోగట్టా.

విదేశాల నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లలో పాల్గొననున్నారు.రామ్ చరణ్ బన్నీ కూడా విదేశాలకు ఎక్కువగా పరిమితమవుతున్న సంగతి తెలిసిందే.

Telugu Allu Arjun, Foreign, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Shar

మహేష్ బాబు( Mahesh Babu ) కూడా త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ మినహా అందరు స్టార్ హీరోలు విదేశాలకు వెళ్లడానికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు.యంగ్ హీరో శర్వానంద్ సైతం ప్రస్తుతం లండన్ లో ఉన్నారని సమాచారం.మాల్దీవ్స్, దుబాయ్, మకావ్, బ్యాంకాక్ లకు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

Telugu Allu Arjun, Foreign, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Ram Charan, Shar

స్టార్ హీరోలలో కొంతమంది విదేశాలలో తమ సినిమాలను షూట్ చేయాలని చెబుతున్నట్టు తెలుస్తోంది.కొంతమంది దర్శకనిర్మాతలు సైతం సమ్మర్ వస్తే విదేశాలకు వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.దర్శకనిర్మాతలు తమ విదేశీ యాత్రల కోసం భారీస్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ హీరోయిన్ల వరకు అందరు హీరోయిన్లు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

కొంతమంది హీరోయిన్లకు విదేశాలకు వెళ్లడానికి అక్కడ ఉన్న ప్రముఖ హోటళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube