బోయపాటికి భయపడుతున్న స్టార్ హీరోలు..?

బోయపాటి అంటే అందరికి ఒకటే గుర్తుకు వస్తుంది.ఆయన తీసే యాక్షన్ సినిమాలు.

 Tollywood Stars Heroes Are Not Interested For Boyapati Movies, Boyapati Srinu, B-TeluguStop.com

భద్ర సినిమా తో తన జర్నీ మొదలుపెట్టి తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు తీసాడు.కానీ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ తో బోయపాటి శ్రీను కు పెద్ద దెబ్బ తగిలింది.

ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో బోయపాటి యాక్షన్ సినిమాలంటేనే స్టార్ హీరోలు భయపడే పరిస్థితి నెలకొంది.

ఈ సినిమా వల్ల రామ్ చరణ్ కూడా చాలా డిస్సపాయింట్ అయ్యాడు.

అయితే బోయపాటి ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బోయపాటి బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కు అఖండ అనే టైటిల్ ను పెట్టారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Boyapatiallu, Boyapati Srinu, Kalyan Ram,

ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాడు బోయపాటి.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి పోయిన పేరును తిరిగి సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నాడు.టీజర్ చూస్తుంటే బోయపాటి ఈ సారి ఖచ్చితంగా హిట్ కొట్టేలాగానే కనిపిస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి చేయబోతున్న సినిమాపై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.

అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని.ఎన్టీఆర్ తో కూడా చేసే అవకాశాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

అయితే బాలకృష్ణ సినిమా పూర్తి అయినా తర్వాత బోయపాటి కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట.ఇప్పటికే కథ గురించి చర్చలు కూడా జరిగాయని ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే అడ్వాన్స్ లు కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

అఖండ సినిమాతో పాటు, కళ్యాణ్ రామ్ సినిమా కూడా హిట్ అయితే మళ్ళీ స్టార్ హీరోలు బోయపాటి వైపు చూసే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube