మద్రాస్‌ అంటే ఎంత ప్రేమ?

తెలుగు సినిమా ఇండస్ట్రీ 1990కు ముందు తమిళనాడులో మద్రాస్‌లో ఉన్న విషయం తెల్సిందే.టాలీవుడ్‌కు చెందిన హీరోలు, హీరోయిన్స్‌, దర్శక నిర్మాతలు అంతా కూడా చెన్నైలోనే అధికంగా ఉండే వారు.

 Tollywood Stars Affection On Madras-TeluguStop.com

ఏవో షూటింగ్స్‌కు, ఇతర కార్యక్రమాలకు తప్ప ఎక్కువగా తెలుగు స్టార్స్‌ అంతా కూడా చెన్నైలోనే జీవించేవారు.అయితే ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు రాష్ట్రంలోనే ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌, ఎయన్నార్‌ వంటి ప్రముఖులు హైదరాబాద్‌కు పరిశ్రమకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారు.

వారి ప్రయత్నం సఫలం అయ్యింది కూడా.అయితే తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా హైదరాబాద్‌కు వచ్చినా తమిళనాడులో మాత్రం మూలాలు అలాగే ఉండి పోయాయి.

ప్రస్తుతం ఉన్న యువ స్టార్‌ హీరోలు దాదాపు అంతా కూడా చెన్నైలో పుట్టి, పెరిగిన వారే.దాంతో తెలుగు సినిమా పరిశ్రమకు చెన్నైతో చాలా సంబంధాలున్నాయి.

ఆ ప్రేమ ఇప్పుడు బయటకు వచ్చింది.తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం అంతా కూడా అతలా కుతలం అయ్యింది.

దాంతో తాము పుట్టి పెరిగిన నగరం కోసం తెలుగు హీరోలు ఎన్నో రకాలుగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.కొంత మంది జోల పట్టి మరీ చెన్నైకు సాయం చేయాలని నిర్ణయించుకుని ముందుకు వస్తున్నారు.

చెన్నై కోసం తామున్నామంటూ ఇప్పటికే ఎంతో మంది తెలుగు హీరోలు తమ వంతు సాయం చేశారు.ఇంకొంత మంది చేసేందుకు ముందుకు వస్తున్నారు.

తెలుగు సినిమాలు తమిళంలో భారీ హిట్‌ అయ్యింది చాలా తక్కువ.అయినా కూడా మానవత దృక్పదంతో పుట్టి పెరిగిన ఊరు అనే ఉద్దేశ్యంతో ఈ సాయంకు టాలీవుడ్‌ స్టార్స్‌ ముందుకు వస్తున్నారు.

వీరు చేసేది బాగానే ఉంది, అయితే సొంత రాష్ట్రంను కూడా అప్పుడప్పుడు ఆదుకోవాలంటూ తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube