అక్టోబర్‌ నుండి అందరూ రంగంలోకి దిగబోతున్నారు  

Tollywood star hero\'s movie shooting start octomber onwards, - Telugu @urstrulymahesh, Acharya, Allu Arjun Pushpa, Chiranjeevi, Mahesh Babu, Pawan Kalyan, Rajamouli Rrr, Sarileru Nikevvaru, Vakeel Sahebh

తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్‌ ల సందడి మెల్లగా ప్రారంభం అవుతోంది.గత ఆరు నెలల కాలంగా షూటింగ్స్‌ లేక బోసి పోయిన లొకేషన్స్‌ మరియు ఇతరత్ర స్టూడియోలో ఇప్పుడు షూటింగ్స్‌ తో మెల్లగా బిజీ అవుతున్నాయి.

TeluguStop.com - Tollywood Star Heros Movie Shooting Start Octomber Onwards

ఆరు నెలల పాటు సినిమా పనులు లేక ఆకలితో అలమటించిన సినీ కార్మికులకు ఇప్పుడిప్పుడే ఆఫర్లు దక్కుతున్నాయి.సెప్టెంబర్‌ నెలలో చాలా సినిమాలు మొదలు అయ్యాయి.

కాని ఇప్పటి వరకు పెద్ద సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ మాత్రం ప్రారంభం అయినట్లుగా అనిపించడం లేదు.టాలీవుడ్‌ లో టాప్‌ హీరోల సినిమాలు మొదలు కూడా అతి త్వరలోనే ఉండబోతుంది.

TeluguStop.com - అక్టోబర్‌ నుండి అందరూ రంగంలోకి దిగబోతున్నారు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే 50 నుండి 60 శాతం షూటింగ్స్‌ సెప్టెంబర్‌ లో జరుగుతున్నాయి.ఇక మిగిలి ఉన్న సినిమాలు కూడా అక్టోబర్‌ నుండి మొదలు కాబోతున్నాయి.కరోనా మహమ్మారికి భయపడుకుంటా ఉంటే అది ఎప్పటి వరకు క్యూర్‌ అయ్యేనో ఎప్పటి వరకు వ్యాక్సిన్‌ వచ్చేనో తెలియదు.కనుక ఏమాత్రం డౌట్‌ లేకుండా షూటింగ్‌లకు వెళ్లి పోవాలని భావిస్తున్నారు.

అయితే సినిమాల మేకింగ్‌ సమయంలో సాధ్యం అయినంత వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తల విషయంలో కఠినంగా ఉండాలంటూ నిర్ణయించారు.

ఇక అక్టోబర్‌ నుండి మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌, అల్లు అర్జున్‌ ఫుష్ప, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, వెంకటేష్‌ నారప్ప ఇంకా కొన్ని చిన్నా చితక సినిమాలు పెద్ద సినిమాలు కూడా పట్టాలెక్కబోతున్నాయి.

థియేటర్లకు అక్టోబర్‌ నుండి అనుమతి వచ్చే అవకాశం ఉంది కనుక జనవరిలో విడుదల చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో షూటింగ్‌కు త్వరపడుతున్నారు.

#Pawan Kalyan #Rajamouli RRR #Mahesh Babu #Vakeel Sahebh #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Star Heros Movie Shooting Start Octomber Onwards Related Telugu News,Photos/Pics,Images..