సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్లే కావడం గమనార్హం.ప్రతిభ ఉండటంతో పాటు నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో ఈ హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
ఒక బ్లాక్ బస్టర్ హిట్ చాలామంది హీరోయిన్ల తలరాతను మార్చింది.సూపర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్కకు విక్రమార్కుడు సినిమాతో సక్సెస్ దక్కింది.
ఆ తరువాత అరుంధతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.తెలుగులో 15 సంవత్సరాలుగా హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.
చందమామ మూవీతో కాజల్ తొలి సక్సెస్ ను అందుకోగా మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతమైందని చెప్పవచ్చు.

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత దూకుడు, బృందావనం సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో సక్సెస్ సొంతమైంది.అయితే 100% లవ్ సినిమాలోని మాహాలక్ష్మీ పాత్రతో తమన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

నేను శైలజ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.అయితే మహానటి తరువాత కీర్తి సురేష్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.సర్కారు వారి పాట సినిమాపైనే కీర్తి సురేష్ ఆశలు పెట్టుకోగా ఆ సినిమాతో కీర్తి సురేష్ ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది.

నాన్నకు ప్రేమతో మూవీతో రకుల్, గీతా గోవిందం సినిమాతో రష్మిక, డీజే మూవీతో పూజా హెగ్డే, గబ్బర్ సింగ్ మూవీతో శృతిహాసన్, ఫిదా మూవీతో సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.