టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ముద్దుపేరు ఏంటో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష( Trisha ) ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్2 ( Ponniin Selvan2 )మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.1999 సంవత్సరంలో జోడీ సినిమాతో త్రిష కెరీర్ మొదలైంది.ఈ సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించిన త్రిష ఆ పాత్రతో మంచి మార్కులు కొట్టేశారు.

నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి త్రిష పరిచయమయ్యారు.వర్షం సినిమా సక్సెస్ సాధించడంతో త్రిష స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరారు.నువ్వొస్తానంటే నేనొద్దంటానా సక్సెస్ తో ఆమె కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కోడి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి త్రిష ప్రశంసలు అందుకున్నారు.బీబీఏ చదివిన త్రిష క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని భావించారు.

16 సంవత్సరాల వయస్సులో మిస్ మద్రాస్ టైటిల్ ను గెలుచుకున్న త్రిష పలు వేదికలపై మెరిశారు.2016 సంవత్సరంలో జల్లికట్టు వివాదం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.త్రిష నిక్ నేమ్ హనీ కాగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు.

Advertisement

చెన్నై, న్యూయార్క్( Chennai, New York ) నగరాలను ఆమె ఎక్కువగా ఇష్టపడతారు.అమీర్ ఖాన్, కమల్ హాసన్, మోహన్ లాల్ ను త్రిష ఎక్కువగా ఇష్టపడతారు.ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటీమణులలో త్రిష ఒకరు.60కు పైగా సినిమాలలో నటించిన ఈ నటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.పొన్నియిన్ సెల్వన్2 సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆమె మెప్పించనున్నారు.

ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.త్రిష కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు