అమ్మ బాబోయ్ : శృతి హాసన్ ఇలా తయారయ్యిందేంటి...

సినిమా అనేది రంగుల ప్రపంచం.ఇక్కడ రాణించాలంటే నటనా ప్రతిభతో పాటు అందం, అభినయం, కూడా చాలా అవసరం.

ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో నటనా ప్రతిభ కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ గ్లామర్ ఉంటే రాణించవచ్చని ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోయిన్లు నిరూపిస్తున్నారు.కాగా తెలుగులో పలువురి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న కోలీవుడ్ బ్యూటీ మరియు ప్రముఖ సీనియర్ స్టార్ హీరో కూతురు “శృతి హాసన్” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Tollywood Star Heroine Shruti Hassan Weight Loss For Glamour Roles-అమ్మ బాబోయ్ : శృతి హాసన్ ఇలా తయారయ్యిందేంటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ అమ్మడు తెలుగులో “అనగనగా ఒక ధీరుడు” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి పరిచయమైంది.ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.దీంతో ఈ అమ్మడు సినిమా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

అయితే ఆ మధ్య పలు వ్యక్తిగత కారణాల వల్ల శృతి హాసన్ దాదాపుగా మూడు సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంది.కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంతో మళ్లీ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కాగా తాజాగా శృతి హాసన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోల కారణంగా సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో శృతి హాసన్ సినిమా అవకాశాల కోసం బరువు బాగానే తగ్గినట్లు కనిపిస్తోంది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ శృతి హాసన్ సినిమా అవకాశాలను దక్కించుకోవడం కోసం పలు సర్జరీలను చేయించుకోవడమే కాకుండా బరువు కూడా బాగా తగ్గిందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా దాదాపు మూడేళ్ళ తర్వాత శృతి హాసన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశాల పరంగా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.కాగా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కేజిఎఫ్ చిత్ర ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.ఇందుకుగాను ఈ అమ్మడు దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

#TollywoodShruti #Salaar #Gubber Singh #Shruti Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు