కష్టకాలం నుంచి గట్టెక్కించేవి ఆ రెండే.. సమంత కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తరువాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉండటంతో పాటు ఎన్నో విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు.శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్న సమంత కరోనా వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు.

 Tollywood Star Heroine Samntha Comments About Present Situations , Present Situa-TeluguStop.com

ఆశ, పాజిటివిటీ ఉంటే కష్టకాలం నుంచి బయటపడవచ్చని సమంత పేర్కొన్నారు.

కరోనా వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంతో విపత్కర పరిస్థితులు ఏర్పడిన సంగతి విదితమే.

ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు.పాజిటివ్ నిర్ధారణ అయితే కరోనా సోకిందన్న భయమే చాలామందిని తెగ టెన్షన్ పెడుతోంది.

మరోవైపు సమంత చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.తెలుగులో శాకుంతలం సినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్నారు.

Telugu Samantha-Movie

ఈ సినిమాతో పాటు కాథవాకుల రెండు కాదల్ అనే సినిమాలో సమంత నటిస్తున్నారు.మరోవైపు సమంతకు కొత్త సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నా సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కమర్షియల్ సక్సెస్ తో పాటు గుర్తుండిపోయే పాత్రలకు సమంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.నాగచైతన్య సినిమాల కథలపై కూడా సమంత దృష్టి పెట్టారని తెలుస్తోంది.

పెళ్లి తరువాత కూడా సమంత నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.సమంత కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కనుండగా ఈ సినిమా భారం సమంతపైనే ఎక్కువగా ఉంది.

ఈ మూవీతో సమంత సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటిస్తున్నారు.

మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో దుశ్యంతుడి పాత్రలో నటిస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube