వామ్మో.. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఆస్తులు అన్ని కోట్లా..?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా నటించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు ఆమెకు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చాయి.తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం రష్మిక నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తూ ఆమె రెమ్యునరేషన్ మరింత పెరగడానికి కారణమవుతున్నాయి.

 Tollywood Star Heroine Rashmika Mandanna Properties Details-TeluguStop.com

యువతలో భారీస్థాయిలో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఉంది.

అయితే ఈ బ్యూటీ ఆస్తులకు సంబంధించి వస్తున్న వార్తలు విని అవాక్కవ్వడం ఆమె ఫ్యాన్స్ వంతవుతోంది.

 Tollywood Star Heroine Rashmika Mandanna Properties Details-వామ్మో.. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఆస్తులు అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ బ్యూటీ ఆస్తి 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని సమాచారం.యాడ్స్ కోసం ఈ బ్యూటీ 15 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల మధ్య తీసుకుంటున్నారు.

ఈ బ్యూటీ పారితోషికం 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల మధ్యలో ఉందని భాషని బట్టి ఈమె పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తక్కువ సమయంలో ఇతర హీరోయిన్ల కంటే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తూ క్రేజ్ ను రష్మిక అంతకంతకూ పెంచుకుంటున్నారు.

హిందీలో అమితాబ్ తో కలిసి గుడ్ బై మూవీలో రష్మిక నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడక ముందే రష్మికకు బాలీవుడ్ లో కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి.రష్మిక బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటే టాలీవుడ్ కు దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Telugu 40 Crore Rupees, Assets And Cars, Expensive, Heroine Rashmika-Movie

రష్మిక శర్వానంద్ కలిసి నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.మరోవైపు రష్మిక చేతిలో పాన్ ఇండియా మూవీ పుష్ప ఉంది.ఈ రెండు సినిమాలతో రష్మిక మందన్నా రెండు బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

#Assets And Cars #40 Crore Rupees #Expensive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు