కరోనా కి భయపడి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసిన స్టార్ హీరోయిన్…  

Rakul preet singh, Tollywood star heroine, Hyderabad, Mumbai, Corona virus - Telugu Corona Virus, Hyderabad, Mumbai, Rakul Preet Singh, Tollywood Star Heroine

తెలుగులో పెద్ద హీరో సందీప్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన  పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ  ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ నిమిత్తం వెళ్లి అక్కడే ముంబైలో ఇరుక్కుపోయింది.

 Tollywood Star Heroine Rakul Preet Singh Return To The Hyderabad From Mumbai

కాగా ప్రస్తుతం ముంబైలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండడంతో ఇటీవలే ముంబై నగరం నుంచి హైదరాబాద్ కి వచ్చినట్లు సమాచారం.అయితే  రకుల్ సింగ్ తో పాటు హైదరాబాద్ కి ఆమె తమ్ముడు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ఈ విషయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.  ప్రస్తుతం ముంబై నగరంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.

కరోనా కి భయపడి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసిన స్టార్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

అందువల్లే రకుల్ ప్రీత్ సింగ్ తన తమ్ముడితో కలిసి హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం రకుల్ బంజారా హిల్స్ పరిసర ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న  “భారతీయుడు 2” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో కూడా ప్రముఖ దర్శకుడు లక్ష రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న “అటాక్” అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

#Mumbai #Hyderabad #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Star Heroine Rakul Preet Singh Return To The Hyderabad From Mumbai Related Telugu News,Photos/Pics,Images..