నేను సిగరెట్లు తాగనంటున్న రకుల్..  కానీ వాళ్ళు మాత్రం…  

Tollywood star heroine Rakul preet singh gives clarity about Cigarette smoking news, Rakul preet singh, Tollywood star heroine, Cigarette smoking, Drugs Case Issue, Tollywood - Telugu Cigarette Smoking, Drugs Case Issue, Rakul Preet Singh, Tollywood, Tollywood Star Heroine, Tollywood Star Heroine Rakul Preet Singh Gives Clarity About Cigarette Smoking News

ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు ఎంతగా కలకలం సృష్టిస్తోందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇందులో భాగంగా పోలీసులు బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్టు చేసి విచారణ చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Tollywood Star Heroine Rakul Preet Singh Gives Clarity About Cigarette Smoking News

  అయితే ఇటీవలే డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు  విచారణలో రియా చక్రవర్తి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయట పెట్టిందని దీంతో ఆమె ఏకంగా తాను పాల్గొంటున్న షూటింగ్ సెట్ నుంచి వెళ్లిపోయిందని గతంలో పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి.

అంతేగాక రకుల్ ప్రీత్ సింగ్ గతంలో పలుమార్లు మత్తు మందు పదార్థాలను వినియోగించే సన్నబడిందని అలాగే జీరో సైజు నడుము ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తోందని పలు వదంతులు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

TeluguStop.com - నేను సిగరెట్లు తాగనంటున్న రకుల్..  కానీ వాళ్ళు మాత్రం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మత్తు మందు వినియోగం మరియు సరఫరా కేసులో రియా చక్రవర్తి ఎలాంటి సినీ సెలబ్రిటీల పేర్లను బయట పెట్టలేదని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సెలబ్రిటీల పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ తాను మత్తు మందు పదార్థాల వినియోగం మరియు సరఫరా కేసులో ఇరుక్కున్నట్లు వస్తున్నటువంటి వార్తలను నిలిపివేయాలంటూ ఇటీవలే హైకోర్టు ని సంప్రదించి పిటిషన్ కూడా దాఖలు చేసింది.

అయితే ఈ పిటిషన్ లో రకుల్ ప్రీత్ సింగ్ తనకు సిగరెట్ లేదా పొగ తాగే అలవాటు లేదని స్పష్టం చేసింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “భారతీయుడు 2” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

#TollywoodStar #TollywoodStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Star Heroine Rakul Preet Singh Gives Clarity About Cigarette Smoking News Related Telugu News,Photos/Pics,Images..