గట్టిగా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్.. కారణమేంటంటే..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో ఆఫర్లు తగ్గినా ఇతర భాషల్లో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.రకుల్ నటించిన ఒక సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే సంగతి తెలియాల్సి ఉంది.

 Tollywood Star Heroine Rakul Preet Singh Cried Why Because-TeluguStop.com

అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ గట్టిగా ఏడ్చేశారు.ఫిట్ నెస్ తెగ ప్రాధాన్యతనిచ్చే రకుల్ అభిమానులతో ఫిట్ నెస్ కు సంబంధించిన చిట్కాలను సైతం తరచూ పంచుకుంటూ ఉంటారు.

ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు.ఈ బ్యూటీ తాజాగా తన గట్టిగా ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 Tollywood Star Heroine Rakul Preet Singh Cried Why Because-గట్టిగా ఏడ్చేసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్.. కారణమేంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రకుల్ ఏడవటం వాస్తవమే అయినా రకుల్ సినిమా డబ్బింగ్ లో భాగంగా మాత్రమే ఏడ్చారు.ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అటాక్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది.

తెలుగులో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ నటించిన ఒక సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.మే డే అనే బాలీవుడ్ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.తెలుగు సినిమాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న రకుల్ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే మాత్రం ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

తెలుగులో ఎన్టీఅర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, చరణ్ లకు జోడీగా రకుల్ నటించారు.

కెరీర్ తొలినాళ్లలోనే రకుల్ కు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో రకుల్ నటించలేకపోయారు.పవన్, ప్రభాస్ కు జోడీగా కనిపించే ఛాన్స్ వస్తే మాత్రం రకుల్ నో చెప్పే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి.

#Attack #Offers #Prabhas #Pawan Kalyan #Sai Dharam Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు