రాధేశ్యామ్ లో లుక్ ని లీక్ చేసిన బుట్టబొమ్మ!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో పూజా హెగ్డే ఒకరు.

 Tollywood Star Heroine Pooja Hegde Reveals Her Look From Radheshyam Movie Wishing Director Radhakrishna In Instagram-TeluguStop.com

వివిధ భాషలలో అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకుని కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తుంటారు.

ఈ విధంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చే క్రమంలో తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా లీక్ చేస్తూ ఉంటారు.గతంలో ఆచార్య సినిమా ఈ విషయంలో కూడా ఈ బుట్ట బొమ్మ అలాగే తొందర పడింది.“ఆచార్య” సినిమాలో పూజా హెగ్డే ఉన్నట్టు డైరెక్టర్ కంటే ముందుగానే స్టోరీని చెప్పి సినిమా గురించి లీక్ చేసింది.తాజాగా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” చిత్రం విషయంలో కూడా పూజా హెగ్డే కొన్ని విషయాలను లీక్ చేశారు.

 Tollywood Star Heroine Pooja Hegde Reveals Her Look From Radheshyam Movie Wishing Director Radhakrishna In Instagram-రాధేశ్యామ్ లో లుక్ ని లీక్ చేసిన బుట్టబొమ్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Instagram, Pooja Hegde, Prabhas, Radha Krishna, Radheshyam-Movie

“రాధేశ్యామ్” సినిమా దర్శకుడు రాధాకృష్ణకి బుట్ట బొమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి.ఆ సినిమాలో తన లుక్ ఏంటో బయటపెట్టింది.దీంతో రాధేశ్యామ్ చిత్రంలో ఈమె మెయిన్ లుక్ ఏంటో బయట పడింది.ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రానికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అదేవిధంగా అక్కినేని అఖిల్ సరసన బుట్ట బొమ్మ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలో ఆడిపాడింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా.అదేవిధంగా “ఆచార్య” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.

#Pooja Hegde #Radheshyam #Radha Krishna #Prabhas #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు