స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

తెలుగు, హిందీ భాషల్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుని వరుస అవకాశాలను అందుపుచ్చుకుంటున్నారు పూజాహెగ్డే.తమిళంలో కూడా పూజాకు వరుస ఆఫర్లు వస్తుండగా పేరు, గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను పూజా హెగ్డే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

 Tollywood Star Heroine Pooja Hegde Glamour Secret  Revealed,latest Tollywood New-TeluguStop.com

అల వైకుంఠపురములో సినిమా తరువాత టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఉండటం గమనార్హం.

పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటించిన రాధేశ్యామ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

పూజా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ ఏడాది జూన్ నెలలో విడుదల కానుంది.అయితే గ్లామరస్ గా కనిపించే పూజాహెగ్డే ఇంత అందంగా కనిపించడానికి తీసుకునే ఫుడ్ కారణమట.

కార్బోహైడ్రేట్లు, నెయ్యి ఉండే ఆహారం తీసుకోవడం వల్లే పూజా ఇంత గ్లామరస్ గా కనిపిస్తోందని సమాచారం.

యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఇతర టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరోయిన్ల హవా తగ్గడంతో పూజా హెగ్డేతో ఇప్పటికే కలిసి నటించినా మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.ఎన్టీఅర్ త్రివిక్రమ్ మూవీలో సైతం పూజా పేరే హీరోయిన్ గా వినిపిస్తోంది.

మరి ఎన్టీఆర్ కు మరోసారి జోడీ పూజాహెగ్డేనే నటిస్తారో లేక మరో కొత్త హీరోయిన్ నటిస్తారో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేసే అలవాటు త్రివిక్రమ్ పూజా హెగ్డేను రిపీట్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఏడాది మే నెలలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా షూట్ మొదలుకానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube