కాజల్ అగర్వాల్ బ్యూటీ, హెల్త్ సీక్రెట్స్ ఇవేనంట..?

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాలు అయినా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.అవకాశాలు తగ్గిన ప్రతిసారి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

 Tollywood Star Heroine Kajal Agarwal Beauty And Health Secrets , Kajal Agarwal,-TeluguStop.com

వయస్సు పెరుగుతున్నా గ్లామర్ గానే కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ అందంగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గతేడాది పెళ్లి చేసుకున్న కాజల్ కొత్త సినిమాలకు కమిటవుతూ సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

కాజల్ అందంగా కనిపించడం, ఆరోగ్యంగా ఉండటం కోసం రోజూ వర్కౌట్లు చేస్తున్నారు.ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న కాజల్ అగర్వాల్ యోగా కూడా చేస్తారు.

యోగాలోని కొన్ని ఆసనాల ద్వారా కాజల్ హార్ట్ ను హెల్తీగా ఉంచుకోవడంతో పాటు మెటబాలిజం మెరుగుపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కాజల్ బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్, ఎగ్స్ తో పాటు గ్రీన్ స్మూతీలను తీసుకుంటున్నారు.

Telugu Aacharya, Secrets, Kajal Agarwal, Offers, Prabhudeva, Workouts, Yoga-Late

ఫ్రూట్స్ తో పేషియల్ చేసుకోవడాన్ని కాజల్ ఇష్టపడతారు.తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే కాజల్ కోకోనట్ ఆయిల్ తో వండిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారని సమాచారం.కాజల్ ఆనియన్ జ్యూస్ ను ఎంతో ఇష్టంగా తాగుతారని తెలుస్తోంది.మరోవైపు కాజల్ నటిస్తున్న ఆచార్య మూవీ ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.గతంతో పోలిస్తే కాజల్ కు ఆఫర్లు తగ్గగా ఆచార్య రిజల్ట్ ను బట్టి కాజల్ కు కొత్త ఆఫర్లు దక్కే అవకాశం ఉంది.

మరోవైపు చాలామంది సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మరికొన్ని రోజుల్లో కాజల్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా కాజల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube