తన పెళ్లి వార్తలపై మళ్లీ సీరియస్ అయిన స్వీటీ...

చిత్రంలో పాత్ర ఏదైనా సరే ఆ పాత్రకి తగ్గట్టుగా పాత్రలో చక్కగా ఒదిగిపోయి తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ఈ అమ్మడికి నాలుగు పదుల వయస్సు దగ్గర పడుతుండడంతో అందరూ అనుష్క శెట్టి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా.? అనే అంశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అంతేగాక అనుష్క శెట్టి ఎక్కడికి వెళ్ళినా కొందరు అదే పనిగా మీ పెళ్లెప్పుడు మరియు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారని అంటూ ప్రశ్నలడుగుతూ విసిగిస్తున్నారు.

 Anushka Shetty, Tollywood Star Heroine, Marriage Rumors, Tollywood-TeluguStop.com

తన పెళ్లి విషయం పై మరోమారు స్పందించింది టాలీవుడ్ స్వీటీ.ఇందులో భాగంగా తన పెళ్లి గురించి తనకు లేని తొందర మీకు ఎందుకంటూ తన పెళ్ళి గురించి అడిగే వారికి ఎదురు ప్రశ్నలు సంధించింది.

అలాగే ఓకే తను పెళ్ళి చేసుకునే సమయంలో కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని కాబట్టి అనవసరంగా నన్ను పెళ్లి గురించి ప్రశ్నలు అడిగి విసిగించ వద్దంటూ అభిమానులని రిక్వెస్ట్ చేసింది.అయితే ఈ మధ్య కాలంలో అనుష్క శెట్టి ఓ ప్రముఖ దర్శకుడి కొడుకుతో పెళ్లిపీటలెక్కనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వైరల్ అవుతోంది.

ఈ విషయంపై మాత్రం అనుష్క శెట్టి ఇప్పటివరకు స్పందిండం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నిశ్శబ్దం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూత పడ్డాయి.

దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని  ఓటిటీ ప్లాట్ ఫారమ్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube