భారీ బడ్జెట్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇదిగోండి పూర్తి వివరాలు!

ప్రస్తుతం స్టార్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడుతున్నారు.దీంతో డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలనే తెరకెక్కించాలి అని మంచి మంచి కథలతో ముందుకు వస్తున్నారు.

 Tollywood Star Heroes With Big Budget Movies Here Are The Complete Details, Ram Charan , Jr.ntr, Prahanth Neil, Allu Arjun, Prabhas, Mahesh Babu-TeluguStop.com

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటించి తమ తరువాయి ప్రాజెక్టులలో కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలలో నటిస్తున్నారు.

ఇంతకూ ఆ హీరోలు ఎవరంటే.

 Tollywood Star Heroes With Big Budget Movies Here Are The Complete Details, Ram Charan , Jr.ntr, Prahanth Neil, Allu Arjun, Prabhas, Mahesh Babu-భారీ బడ్జెట్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇదిగోండి పూర్తి వివరాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అయినా క్రేజ్ మొత్తం మారిపోయింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడ్డాడు.దాంతో సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ముందుకు రాగా ఈ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.

ఇక ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ 3D సినిమాలో బిజీగా ఉన్నాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు.వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, దీపికా పదుకొణెతో కలిసి ప్రాజెక్ట్- K సినిమాలో నటిస్తున్నాడు.తరువాత మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగతో కలిసి స్పిరిట్ సినిమాల్లో నటించనున్నాడు.

Telugu Allu Arjun, Jr Ntr, Mahesh Babu, Prabhas, Prahanth Neil, Ram Charan-Movie

ఎన్టీఆర్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టుతో బిజీగా మారాడు.అందులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 సినిమాను చేయనున్నాడు.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.దీంతో పాటు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కూడా భారీ బడ్జెట్ తో మరో రెండు సినిమాలు చేయనున్నాడు.

రామ్ చరణ్: స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఆ సినిమా తర్వాత ఆచార్యతో ముందుకు రాగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అయితే చరణ్ ఆచితూచి ఆడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు.ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా #RC15.

ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా ఈ సినిమా దాదాపుగా 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందని సమాచారం.ఇక గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్ డైరెక్టర్స్ తో రామ్ చరణ్ మరో రెండు సినిమాలను చేయనున్నాడు.

మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 సినిమాను చేయనున్నాడు.

అంతే కాకుండా దర్శకధీరుడు రాజమౌళి తో కూడా పాన్ ఇండియా సినిమాను చేయనున్నాడు.ఇక ఈ రెండు సినిమాలతో మహేష్ బాబు ఇంకెంత హిట్ అందుకుంటాడో చూడాలి.

అల్లు అర్జున్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.దాదాపు 400crs పైగా కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఆయన ప్రస్తుతం తన పూర్తి సమయంను పుష్ప -2 సినిమా కోసమే కేటాయిస్తున్నాడు.ఇక ఇతర సినిమాలకి మాత్రం సైన్ చేయలేదని తెలుస్తుంది.ఏదైనా పుష్ప 2 తర్వాతే అన్నట్లుగా ఉన్నాడు అని తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube