టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ హీరో ప్రభాస్.. రెండు, మూడు స్థానాల్లో ఎవరంటే?

ఓరమ్యాక్స్ సర్వే 2022 సంవత్సరానికి సంబంధించి టాప్ 10 తెలుగు పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితాను విడుదల చేసింది.పాన్ ఇండియా స్టార్ గా ఊహించని రేంజ్ లో పాపులారిటీని కలిగి ఉన్న ప్రభాస్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచారు.

 Tollywood Star Heroes Positions  Details Here Goes Viral In Social Media , Tolly-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.ఆర్.

ఆర్.ఆర్ సక్సెస్ వల్ల తారక్ కు ఈ జాబితాలో సెకండ్ పొజిషన్ దక్కింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు.

పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.

స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.రామ్ చరణ్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టారు.ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది.మహేష్ ఐదో స్థానంలో నిలిస్తే పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో నిలిచారు.

గతేడాది భీమ్లా నాయక్ మూవీతో సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది హరిహర వీరమల్లు సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.న్యాచురల్ స్టార్ నాని గతేడాది అంటే సుందరానికి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా నాని ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలవడం గమనార్హం.మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు.

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా పదో స్థానంలో మాస్ మహారాజ్ రవితేజ నిలిచారు.కొంతమంది హీరోలు తమ ఫేవరెట్ హీరోలు అయినప్పటికీ వాళ్లకు ఈ జాబితాలో ఛాన్స్ దక్కకపోవడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube