పాన్ ఇండియా మీద పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోలు  

Tollywood Bollywood Telugu Cinema Allu Arjun Rrr Ntr And Tarak - Telugu Bollywood, Telugu Cinema, Tollywood, Tollywood Star Heroes Planing On Pan India Movie

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ ఇప్పటి వరకు కేవలం తెలుగు భాషకి మాత్రమే పరిమితం అయ్యి సినిమాలు చేసేవారు.అప్పుడప్పుడు వారి సినిమాలు ఇతర భాషలలో డబ్బింగ్ అవుతూ ఉండేవి.

 Tollywood Bollywood Telugu Cinema Allu Arjun Rrr Ntr And Tarak

అయితే బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్టామినా దేశ వ్యాప్తంగా తెలిసింది.ఈ నేపధ్యంలో బాహుబలిని అనుసరిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగా ఉండేలా చూసుకుంటున్నాడు.

సాహోతో పాటు ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే.పాన్ ఇండియా మూవీగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండటంతో బడ్జెట్ పరిధులు కూడా పెంచుకొని, కాస్టింగ్ విషయంలో కూడా అన్ని భాషల ప్రేక్షకులకి చేరువ అయ్యే విధంగా చూసుకుంటున్నారు.

పాన్ ఇండియా మీద పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోలు-Movie-Telugu Tollywood Photo Image

ప్రభాస్ ని అనుసరిస్తూ చిరంజీవి పాన్ ఇండియా మూవీగానే సైరా సినిమా రిలీజ్ చేశారు.ఇక సినిమాలో అమితాబచ్చన్ లాంటి స్టార్ నటుడు కూడా హిందీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు.

అయితే ఇప్పుడు రాజమౌళి మరోసారి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా సినిమానే తీస్తున్నాడు.ఇక పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండతో తీస్తున్న మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేశాడు.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.అన్ని భాషలలో తెలుగు స్టార్ హీరోలు ఇలా పాన్ ఇండియా పేరుతో సినిమాలు రిలీజ్ చేస్తూ వారి మార్కెట్ పరిధులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ ప్రయత్నం సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తాయి.అలా కాకుంటే మళ్ళీ దుకాణం సర్దుకొని కేవలం తెలుగుకి పరిమితం అయిపోవాల్సిందే.

అయితే యుట్యూబ్ లో సౌత్ మాస్ సినిమాలకి మంచి వ్యూస్ వస్తూ ఉండటంతో కరెక్ట్ గా ప్రమోషన్ చేసుకుంటే థియేటర్స్ లో కూడా సూపర్ హిట్ అవుతాయని మన స్టార్ హీరోలు భావించి తమ సినిమాలు అన్ని భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Star Heroes Planing On Pan India Movie Related Telugu News,Photos/Pics,Images..