కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ మొన్న సంక్రాంతి కానుకగా వారిసు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.తెలుగు లో వారసుడు గా ఆ సినిమా విడుదల అయ్యింది.
తమిళనాట ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.తమిళనాడులోని అన్ని ఏరియాల్లో కూడా వారిసు సాధించిన కలెక్షన్స్ బాక్సాఫీస్ వర్గాల వారిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెల్సిందే.
వారిసు సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా తిరగకుండానే తన తదుపరి సినిమా యొక్క విడుదల తేదీని సూపర్ స్టార్ విజయ్ ప్రకటించాడు.తాజాగా లియో అంటూ టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు ఇదే ఏడాది అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల అయిన వీడియో కు మంచి రెస్పాన్స్ దక్కింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని దీంతో క్లారిటీ వచ్చేసింది.

హీరోగా విజయ్ ఒక్క ఏడాదిలోనే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.కానీ మన హీరోలు మాత్రం ఏళ్లకు ఏళ్లు స్కిప్ చేస్తున్నారు.ఏడాదికి రెండు కాదు కదా కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాదిని స్కిప్ చేయబోతున్నాడు.అల్లు అర్జున్ మరియు బాలకృష్ణ లు గత ఏడాది స్కిప్ చేయడం జరిగింది.

ఈ ఏడాదిలో ఏ స్టార్ హీరోలు సినిమాలు వస్తున్నాయో క్లారిటీ లేదు.మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా ల విడుదల విషయంలో చాలా అలసత్వం ను ప్రదర్శిస్తున్నారు.అందుకే మన హీరో లు కూడా సూపర్ స్టార్ విజయ్ ని ఫాలో అయితే ఎంత బాగుంటుందో కదా అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
ఏడాదికి రెండు కాకున్నా కనీసం ఒకటి అయినా విడుదల చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
