ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును దాటిన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలివే?

గత కొన్నేళ్లలో కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సాధించాయి. అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న పెద్ద హీరోల సినిమాలు చాలానే ఉన్నాయి.స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఓవర్సీస్ లో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.బాహుబలి2, సాహో, రాధేశ్యామ్ సినిమాలు కూడా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నాయి.ప్రభాస్ కు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ వల్లే ఈ రేర్ రికార్డ్ ఆయన సొంతమైంది.మరో స్టార్ హీరో మహేష్ బాబుకు ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

 Tollywood Star Heroes Movies Overseas Collections Details Here Goes Viral  Tolly-TeluguStop.com

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు ఓవర్సీస్ లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి.

నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాలతో పాటు ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నాయి.ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లో ఏకంగా 14.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును దాటాయి.

బన్నీ నటించిన పుష్ప ది రైజ్ 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించగా అల వైకుంఠపురములో సినిమా కూడా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది.రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్కును అందుకుంది.

రంగస్థలం సినిమా కూడా దాదాపుగా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది.

Telugu Mark, Allu Arjun, Bahubali, Ntr, Khodi, Prabhas, Radheshyam, Ram Charan,

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలూ ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సాధించాయి.కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ నటించిన రోబో, 2.0, కబాలి, పేట సినిమాలు ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube