ఓటీటీ వైరస్ సోకకుండా జాగ్రత్త పడుతున్న స్టార్ హీరోలు.. ఏమైందంటే..?

కరోనా వైరస్ వల్ల స్టార్ హీరోలు కోట్ల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసిందే.సినిమాలు వాయిదా పడటంతో పాటు స్టార్ హీరోల కొత్త సినిమాల షూటింగ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

 Tollywood Star Heroes Lost Interest On Ott Here Is The Reason, Effect On Market-TeluguStop.com

అయితే ప్రస్తుతం వెంకటేష్ మినహా మిగిలిన హీరోలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు.ఓటీటీలలో తమ సినిమాలను రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని హీరోలు భావిస్తున్నారు.

ఓటీటీ బాట పడితే థియేట్రికల్ మార్కెట్ తగ్గుతుందని హీరోలు భయపడుతున్నారు.ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల పెట్టుబడిలో ఏకంగా 60 శాతం నష్టాలు వచ్చాయి.

గతేడాది అక్షయ్ కుమార్ లక్ష్మీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తరువాత సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని అక్షయ్ కుమార్ తేల్చి చెప్పారు.

Telugu Effect, Laxmi, Ott, Radhe, Theaters-Movie

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు భారీగా ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఆ సినిమా నిర్మాతలు థియేటర్లలోనే సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.ఓటీటీ బాట పడితే కమర్షియల్ మార్కెట్ భారీగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.ఓటీటీలకు సినిమాలను ఇస్తే తరువాత సినిమాలకు కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని స్టార్ హీరోలు భావిస్తున్నారు.

నిర్మాతలకు భారం పెరగకుండా కొందరు హీరోలు వడ్డీ భారం మోస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Effect, Laxmi, Ott, Radhe, Theaters-Movie

స్టార్ హీరోల రెమ్యునరేషన్లు గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.కొంతమంది హీరోలు సొంతంగా సినిమాలలో నటించడంతో పాటు ఆ సినిమాలను నిర్మిస్తూ లైట్ లైట్ లో ఉండటానికి ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.కొంతమంది హీరోలు టాప్ ప్రొడ్యూసర్లతో కలిసి సినిమాలను నిర్మిస్తూ లాభాలను క్యాష్ చేసుకుంటున్నారు.

పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube