టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియాపై కూడా ఫోకస్ పెట్టి క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు( Allu Arjun ) ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయంలో బన్నీ సాధించిన రికార్డ్ ను బ్రేక్ చేయడం మరో హీరోకు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) విషయానికి వస్తే ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా ప్రభాస్ కు ఏకంగా 11.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.త్వరలో ప్రభాస్ ఫాలోవర్ల సంఖ్య 12 మిలియన్లకు చేరే ఛాన్స్ ఉంది.మహేష్ బాబు( Mahesh Babu ) ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 13.3 మిలియన్లుగా ఉంది.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) విషయానికి వస్తే తారక్ కు ఇన్ స్టాగ్రామ్ లో 7.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 21 మిలియన్లుగా ఉంది.తక్కువ పోస్ట్ లతో రామ్ చరణ్ ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ఇన్ స్టాగ్రామ్ లో 2.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చాలామంది హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ ఆలస్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చారు.
కొంతమంది టాలీవుడ్ హీరోయిన్లు సైతం రికార్డ్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.

హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం ద్వారా అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.సమంతకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 33.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.కాజల్ అగర్వాల్ కు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 27.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.