టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో లాభాలను అందించిన సినిమాలు ఇవే!

భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలను నిర్మించే ఇండస్ట్రీగా టాలీవుడ్ కు పేరుంది.ప్రతి సంవత్సరం టాలీవుడ్ లో 250కు పైగా సినిమాలు తెరకెక్కుతాయనే సంగతి తెలిసిందే.

 Tollywood Star Heroes Huge Profit Movies Bahubali Rrr F2 Rangasthalam Details, T-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ లాభాలను అందించిన సినిమాల విషయానికి వస్తే బాహుబలి1 సినిమాకు 186 కోట్ల రూపాయల లాభాలు రాగా బాహుబలి2 సినిమాకు 508 కోట్ల రూపాయల లాభం వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు 300 కోట్ల రూపాయలకు అటూఇటుగా మేకర్స్ కు లాభాలు వచ్చాయని తెలుస్తోంది.అల వైకుంఠపురములో సినిమాకు ఆ సినిమా నిర్మాతలకు ఏకంగా 75.88 కోట్ల రూపాయల లాభం వచ్చింది.ఎఫ్2 సినిమాకు నిర్మాత దిల్ రాజుకు ఏకంగా 50 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని బోగట్టా.రంగస్థలం సినిమాకు నిర్మాతలకు 47.52 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలుస్తోంది.

Telugu Bahubali, Karthikeya, Pan India, Rangasthalam, Tollywood-Movie

నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ2 సినిమాకు 45 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు వచ్చాయి.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు ఏకంగా 45 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఈ సినిమాలు మాత్రమే భారీ మొత్తం లాభాలను అందించడం గమనార్హం.

టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది.

Telugu Bahubali, Karthikeya, Pan India, Rangasthalam, Tollywood-Movie

కొన్ని సినిమాలు హిందీలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా తెలుగులో మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.ఈ ఏడాది భారీ లాభాలను అందించిన సినిమాల జాబితాలో ఏయే సినిమాలు చేరతాయో చూడాల్సి ఉంది.టాలీవుడ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

టాలీవుడ్ హీరోలకు క్రేజ్, మార్కెట్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube