యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కల్సిన మరో సినిమా వేర్వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.
ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమా పనులతో బిజీ అయ్యారు.త్వరలో మహేష్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదలుపెట్టనున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఏ హీరో నటిస్తారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
పవన్ రాబోయే రోజుల్లో రాజకీయాలపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం అయితే దాదాపుగా లేదని చెప్పాలి.స్టార్ హీరో బన్నీ ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.

ప్రభాస్, చరణ్ లతో ఇప్పటివరకు త్రివిక్రమ్ ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు.అయితే ఈ హీరోలు ఇప్పటికే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ హీరోలతో త్రివిక్రమ్ తెరకెక్కించే ఛాన్స్ లేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక విధంగా దూరమవుతున్నారనే చెప్పాలి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గతంలో కూడా ఇదే తరహా సమస్య ఎదురైతే ఆ సమయంలో నితిన్ తో త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించారు.స్టార్ హీరోలు త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇస్తే మాత్రం త్రివిక్రమ్ మిడిల్ రేంజ్ హీరోలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ విధంగా ముందుకెళతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.







