హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే..?

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సక్సెస్ లో ఉన్న హీరోలకు ఉన్న గుర్తింపు, క్రేజ్ ఫ్లాప్ హీరోలకు ఉండదు.సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా కొంతమంది హీరోలు ఎదురుచూస్తున్నారు.

 Tollywood Star Heroes Are Waiting To Get One Hit Movie-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోలలో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన హీరోలలో రామ్ చరణ్ ముందువరసలో ఉన్నారు.రామ్ చరణ్ గత సినిమా వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది.యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా సక్సెస్ సాధించాల్సి ఉంది.

 Tollywood Star Heroes Are Waiting To Get One Hit Movie-హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో హిట్ కాలేదనే సంగతి తెలిసిందే.

వరుస ఫ్లాపులతో నాగార్జున కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

Telugu Acharya, Bangarraju, Bimbisara, Flop Heroes, Kalayan Ram, Liger, Naga Shourya, Nagarjuna, Ram Charan, Rrr, Tollywood Flop Heroes, Vijay Devarakonda-Movie

నాగార్జున గత సినిమా వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అనిపించుకుంది.నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.యంగ్ హీరో నాగశౌర్య హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు.త్వరలో నాగశౌర్య నటించిన వరుడు కావలెను, లక్ష్య సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

Telugu Acharya, Bangarraju, Bimbisara, Flop Heroes, Kalayan Ram, Liger, Naga Shourya, Nagarjuna, Ram Charan, Rrr, Tollywood Flop Heroes, Vijay Devarakonda-Movie

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఈ హీరో బింబిసార సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలతో కళ్యాణ్ రామ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

#TollywoodFlop #Bimbisara #Acharya #Flop Heroes #Naga Shourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు