క్రూరమైన విలన్లుగా మెప్పించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ పాత్రలను దర్శకులు కొంచెం నెగిటివ్ గా చూపిస్తామన్నా ఇష్టపడే వారు కాదు.అభిమానుల ఆలోచనా ధోరణి కూడా అదే విధంగా ఉండేది.

 Tollywood Star Heroes Acted Villains In These Movies, Jai Lavakusha, Ntr, Rx100,-TeluguStop.com

అయితే మారుతున్న కాలంతో పాటే ప్రేక్షకుల ఆలోచనా తీరు మారుతుండటంతో హీరోలు సైతం నవ్యత ఉన్న కథల వైపు ఆకర్షితులవుతున్నారు.సినిమాల్లో విలన్లుగా కనిపించడానికి సైతం సిద్ధమవుతూ కొత్త తరహా పాత్రల్లో నటించి మెప్పు పొందుతున్నారు.

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో తనే హీరోగా తనే విలన్ గా నటించారు.ఆ సినిమాలో రావణుడిని పోలిన ఎన్టీఆర్ పాత్రను చూసిన అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి.

ఎన్టీఆర్ కెరీర్ లోనే జై లవకుశ సినిమాలోని జై పాత్ర ప్రత్యేక పాత్రగా నిలిచింది.స్టార్ కమెడియన్ సునీల్ ఒకప్పుడు తన కామెడీతో నవ్వులపువ్వులు పూయించారు.హీరోగా పెద్దగా విజయాలు దక్కకపోవడంతో మళ్లీ కమెడియన్ పాత్రలో నటిస్తున్న సునీల్ కలర్ ఫోటో సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో నటించారు.

Telugu Bahubali, Jai Lavakusha, Karthikeya, Nani, Naveen Chandra, Rana-Movie

ఆర్ ఎక్స్ 100 సినిమా సక్సెస్ తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమాలో నానికి విలన్ గా దేవ్ అనే పాత్రలో నటించి మెప్పించారు.ఆ పాత్ర కార్తికేయకు మంచి గుర్తింపు తీసుకొనిరాగా ప్రస్తుతం కార్తికేయ చేతిలో హీరోగా రెండు సినిమాలున్నాయి.అందాల రాక్షసి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా నటించాడు.

Telugu Bahubali, Jai Lavakusha, Karthikeya, Nani, Naveen Chandra, Rana-Movie

నేను లోకల్, ఎవరు సినిమాల్లోనూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు.న్యాచురల్ స్టార్ నాని వి సినిమాలో క్రూరమైన విలన్ గా కనిపించి ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగలనని ప్రూవ్ చేశారు.హీరోగా వరుస విజయాలను సొంతం చేరుకుని బిజీగా ఉన్న సమయంలో బాహుబలిలో భళ్లాలదేవ పాత్రలో నటించి రానా మెప్పించారు.టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో స్టైలిష్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Bahubali, Jai Lavakusha, Karthikeya, Nani, Naveen Chandra, Rana-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube