ఆకలి కష్టాలు అనుభవించిన హీరో రవితేజ.. 10 రూపాయలతో ఎలా జీవించారంటే?

స్టార్ హీరో రవితేజ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది.తన మార్కెట్ ను మించి రవితేజ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారనే సంగతి తెలిసిందే.

 Tollywood Star Hero Raviteja Suffering Days Details, Raviteja, Hero Raviteja, Ra-TeluguStop.com

రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో క్రాక్ సినిమా మాత్రమే భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రవితేజ ఆకలి కష్టాలను అనుభవించారు.

రవితేజతో కలిసి పని చేసిన ఒక హీరోయిన్ రవితేజ అనుభవించిన కష్టాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.అమీర్ పేటలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై రాజా ది గ్రేట్ లో ఒక సాంగ్ చేసిన అశ్విని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

10 రూపాయలతో రవితేజ రోజంతా గడిపారని అలా అనుభవించిన కష్టాలను ఆయన తనతో చెప్పుకున్నారని అశ్విని అన్నారు.

Telugu Ashwini, Sharath Mandava, Raviteja, Rama Rao Duty, Ravitejacine, Raviteja

మధ్యాహ్నం 10 రూపాయలతో భోజనం చేస్తే రాత్రి సమయంలో ఆకలితో కడుపు మాడ్చుకోవాలని భావించి రవితేజ రాత్రిపూట మాత్రమే ఆ 10 రూపాయలు ఖర్చు చేసి భోజనం చేసేవారని అశ్విని చెప్పుకొచ్చారు.స్టార్ హీరోలు కావడం సులువు కాదని ఎన్నో కష్టాలను అనుభవిస్తే మాత్రమే స్టార్ హీరోలు కావడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

Telugu Ashwini, Sharath Mandava, Raviteja, Rama Rao Duty, Ravitejacine, Raviteja

మరోవైపు రవితేజ హీరోగా శరత్ మాండవ డైరెక్షన్ లో తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ జూన్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకావాల్సి ఉండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

హీరో రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube