టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ దగ్గర ఖరీదైన కార్లు ఉండగా ఆ కార్ల ఖరీదు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
మార్కెట్ లోకి ఏదైనా కారు కొత్త మోడల్ వస్తే వెంటనే ఆ కారును కొనుగోలు చేస్తారు.తాజాగా చరణ్ ఖరీదైన ఫెర్రారీ కార్ లో ప్రయాణించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
చరణ్ దగ్గర ఉన్న కార్లను పరిశీలిస్తే రోల్స్ రాయిస్ ఫాంటూమ్( Rolls Royce Phantom ) కారు ధర 9.57 కోట్ల రూపాయలుగా ఉంది.మెర్సిడెస్ మేబాచ్ జీ.ఎల్.ఎస్ 600( Mercedes Maybach GLS 600 ) కారు రామ్ చరణ్ దగ్గర ఉండగా ఈ కారు ధర 4 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.చరణ్ దగ్గర ఉన్న మరో ఖరిదైన కారు ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 కాగా ఈ కారు ఖరీదు 3.2 కోట్ల రూపాయలుగా ఉంది.చరణ్ దగ్గర ఫెర్రారీ ఫోర్టాఫీనో కారు ఉండగా ఈ కారు ఖరీదు 3.50 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.
రేంజ్ రోవర్ ఆటోగ్రఫీ కారు( Range Rover Autograph Car ) ఖరీదు 2.75 కోట్ల రూపాయలు కాగా బీ.ఎమ్.డబ్ల్యూ 7 సిరీస్ కారు( BMW 7 series car ) ఖరీదు కోటీ 75 లక్షల రూపాయలుగా ఉంది.మెర్సిడెజ్ బెంజ్ జీ.ఎల్.ఈ 450 ఏ.ఎమ్.జీ కూప్ కూడా రామ్ చరణ్ దగ్గర ఉండగా కోటి రూపాయల రేంజ్ లో చరణ్ ఈ కారు కోసం ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది రిలీజ్ కానుండటం గమనార్హం.
రామ్ చరణ్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ రేంజ్ లో ఉండగా చరణ్ తో సినిమాలు చేయడానికి కొత్త డైరెక్టర్లతో పాటు స్టార్ డైరెక్టర్లు కూడా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ సినిమాలు నష్టాలను మిగిల్చిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.రామ్ చరణ్ కు క్రేజ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.