స్టార్ హీరోతో డేటింగ్ పై నిధి ఘాటు వ్యాఖ్యలు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు.సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన నిధి అగర్వాల్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చిపెట్టింది.

 Tollywood Star Hero Nidhi Agarwal Dateing News Indian Cricketer-TeluguStop.com

అయితే నిధి అగర్వాల్ ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని నెలల క్రితం నిధి అగర్వాల్ ఒక క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

 Tollywood Star Hero Nidhi Agarwal Dateing News Indian Cricketer-స్టార్ హీరోతో డేటింగ్ పై నిధి ఘాటు వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలతో కంటే ఇలాంటి వార్తలతో పాపులర్ అవుతున్న నిధి అగర్వాల్ డేటింగ్ వార్తలపై స్పందించి వివరణ ఇచ్చింది.వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.తాను ఎవరితో డేటింగ్ లో లేనని.అలాంటి వార్తలను నమ్మవద్దని పేర్కొంది.

ప్రస్తుతానికి తాను సింగిల్ అని ఎవరితోనైనా డేటింగ్ లో ఉంటే తనే స్వయంగా ప్రకటిస్తానని వెల్లడించింది.

నిధి అగర్వాల్ స్పష్టతనివ్వడంతో డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లేనని చెప్పవచ్చు.

మొదట్లో గాసిప్ వార్తలపై స్పందించని నిధి అగర్వాల్ సైలెంట్ గా ఉంటే ఆ వార్తలు నిజమేనని నమ్మే అవకాశం ఉందని భావించి వివరణ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల సినిమాలలో కూడా నిధి హీరోయిన్ గా నటించింది.

అయితే స్టార్ హీరోలతో అవకాశాలు రాకపోవడం నిధి కెరీర్ కు మైనస్ గా మారింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్ గల్లా అశోక్ డెబ్యూ సినిమాతో పాటు తమిళంలో శింబు సరసన ఒక సినిమాలో నటిస్తోంది.

తెలుగులో ఒక స్టార్ హీరో సరసన నిధి అగర్వాల్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.అందం, అభినయం ఉన్న నిధికి స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ కావడం గ్యారంటీ.

#Galla Ashok #Ismart Shanker #Shimbhu #@AgerwalNidhhi #Nidhi Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు