నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ.. రాహుల్ రామకృష్ణపై నాని సెటైర్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించిన రాహుల్ రామకృష్ణకు “జాతి రత్నాలు” సినిమా మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.

 Tollywood Hero Nani Satires On Rahul Ramakrishna, Hero Nani, Rahul Ramakrishna,-TeluguStop.com

ఈ గుర్తింపుతోనే రాహుల్ రామకృష్ణ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్నటువంటి వెబ్ మూవీ “నెట్”.ఈ చిత్రం సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి కానుకగా జీ5 లో ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ ఈ సినిమా ప్రమోషన్ లో పెద్ద ఎత్తున పాల్గొంటూ వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు.ఇతని ట్వీట్స్ పై వచ్చే విమర్శలకు సమాధానంగా ఇక్కడ అందరూ పత్తిత్తులు అంటూ సెటైర్లు వేశారు.ఇకపోతే రాహుల్ రామకృష్ణ తాజాగా నాచురల్ స్టార్ నానిను ట్యాగ్ చేస్తూ తాను నానికి పెద్ద అభిమానినని అయినా కూడా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల కాబోయే “టక్ జగదీష్” చిత్రం కంటే నా సినిమానే ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే రాహుల్ చేసిన ట్వీట్ కి నాని స్పందిస్తూ..”నీకు ప్రాబ్లమ్ అయితే వెళ్లిపోతా మామ.” అంటూ జాతిరత్నాలు సినిమాలోని రాహుల్ డైలాగుతో పంచ్ వేశాడు.

సెప్టెంబర్ 10వ తేదీన రాహుల్ రామకృష్ణ “నెట్”, నాని “టక్ జగదీష్”, నాగచైతన్య “లవ్ స్టోరీ” సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో వీటి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ పలు వివాదాస్పద ట్వీట్ ద్వారా ఈ సినిమాకు భారీ ప్రమోషన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కష్టపడి పనిచేసే సిబ్బంది, అంకితభావంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, కమర్షియల్ సినిమాల మాదిరిగా కాకుండా కథ చెప్పే దైర్యం మా సినిమాకు ఉంది మాకు మద్దతివ్వండి అంటూ ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube