నేడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనే సంగతి మనందరికీ తెలిసిందే.స్టార్ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.
వరుస పరాజయాలతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ హిట్ తో సత్తా చాటడం గమనార్హం.అయితే ఓటములను ఎన్టీఆర్ విజయానికి మెట్లుగా మార్చుకున్నారు.
ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆది సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేతికి చాలా పెద్ద గాయమైంది.ఆ గాయానికి చికిత్స తీసుకుని గాయం పూర్తిగా మానకముందే ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం.2009 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి వచ్చే సమయంలో ప్రమాదానికి గురయ్యారు.
కొన్ని నెలలు బెడ్ కే పరిమితమైన ఎన్టీఆర్ గాయాలు పూర్తిగా తగ్గకపోయినా షూటింగ్ లో పాల్గొనడంతో పాటు కఠినమైన స్టెప్స్ వేసి మెప్పించారు.రోడ్డు ప్రమాదాల్లో ఎన్టీఆర్ అమితంగా ప్రేమించే హరికృష్ణ, అన్న జానకీరామ్ చనిపోయారు.
ఇప్పటికీ ఎన్టీఆర్ తన సినిమాల్లో, ఆడియో ఫంక్షన్లలో జాగ్రత్తగా వెళ్లమని అభిమానులకు ఎన్టీఆర్ సూచనలు చేస్తూ ఉంటారు.ఇండస్ట్రీలోని చాలామంది హీరోలకు బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్ కావడం గమనార్హం.

దర్శకధీరుడు రాజమౌళి ఎక్కువగా అభిమానించే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం.చరణ్, మహేష్ లతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది.ఎలాంటి పాత్రలోనైనా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తారని ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం అభిప్రాయపడతారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తైన వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు.