ఆ వారసుడి జీవితంలో మరో అమ్మాయ్.. అందుకే స్టార్ హీరోయిన్‌కు విడాకులు?

సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ నటుడు.తన తండ్రి ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Tollywood Star Family Divorce Gossips Going Viral In Industry,  Tollywood, Hero,-TeluguStop.com

ఇక ఆయనే కాకుండా ఆయన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇప్పటికీ తన వారసులతో పోటీగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

కానీ తన వారసులను మాత్రం స్టార్ నటులుగా చేయలేకపోతున్నాడు.ఆ వారసులు పలు సినిమాలలో నటించిన కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు.

ఇక అందులో ఒక వారసుడు తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ను ఇష్టపడ్డాడు.తమ మధ్య ఉన్న ప్రేమను ఇండస్ట్రీలో బయటపడకుండా జాగ్రత్తగా కొనసాగించారు.ఆ తర్వాత పెద్దలతో తమ ప్రేమ విషయాన్ని తెలిపి పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.ఇక ఆ హీరోయిన్ ఆ కుటుంబంలో అడుగుపెట్టాక తను కూడా మరింత పేరు సంపాదించుకుంది.

పెళ్లి తర్వాత కూడా తను సినిమాలలో నటించడానికి ఆ కుటుంబం నుండి మంచి సపోర్ట్ అందింది.ఇక సొంతంగా బిజినెస్ లు కూడా మొదలుపెట్టింది ఆ హీరోయిన్.

పెళ్లి తర్వాత భార్యభర్తలిద్దరు పలు సినిమాలలో కూడా కలిసి నటించారు.పలు వాణిజ్యపర ప్రకటనలు కూడా చేసారు.ఇక ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ట్రెండ్ ని ఫాలో అవడమే కాకుండా తన భర్తతో, తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.

Telugu Divorce, Fans, Tollywood, Tolywood-Movie

తన భర్తతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ కూడా చేస్తుంది.ఇక ఆ హీరోయిన్ పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే ఎక్కువ అవకాశాలు అందుకుంది.ఇతర ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

కానీ తన భర్త మాత్రం ఇంకా స్టార్ హోదాను సంపాదించుకోలేకపోతున్నాడు.

ప్రస్తుతం పలు సినిమాలలో నటించగా అందులో సక్సెస్ కోసం పోరాడుతున్నాడు ఆ హీరో.ఇదిలా ఉంటే ఇంత మంచి జీవితంను కొనసాగిస్తున్న ఆ హీరో హీరోయిన్ లు కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు.

భార్యభర్తలిద్దరు త్వరలోనే విడిపోతున్నారని వార్తలు వినిపించాయి.ఇక ఆ హీరో హీరోయిన్ అభిమానులు కూడా వీరు విడాకులు తీసుకుంటున్నారని తెలిసేసరికి షాక్ అయ్యారు.

Telugu Divorce, Fans, Tollywood, Tolywood-Movie

ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా ఉన్న ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు.ఇక మరికొందరు తమ దాంపత్య జీవితం మధ్య గొడవలు జరుగుతున్నాయని అందుకే ఆ హీరోయిన్ ఆ హీరోకి దూరంగా ఉంటుందని వార్తలు కూడా వినిపించాయి.ఇక కొందరు ఆ హీరోయిన్ తన భర్త మాట వినట్లేదని అందుకే తనను దూరంగా ఉంచాడని తెలియగా మరికొందరు ఆ హీరో జీవితంలో మరో అమ్మాయి ఎంట్రీ ఇచ్చిందని.అందుకే ఆ హీరోయిన్ ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా లేదా వేరే అమ్మాయా అని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube