అందంగా ఉన్నావని అంటాడు …. బుట్టలో  పడ్డారో ఇక అంతే…  

Msc Graduate Blackmailing Women In Social Media - Telugu Ap, Crime News, Man Arrested, Ms Graduated, Nelloore, Social Media

ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లను సృష్టించి ప్రేమ పేరుతో అమాయకపు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.తాజాగా పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి ఓ యువకుడు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను సృష్టించి అందమైన ఆడపిల్లలకు ప్రేమ సందేశాలు పంపుతూ వారిని బుట్టలో వేసుకొని చివరికి తన కోరికలు తీర్చకపోతే ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తూ తన కామ వాంఛలను తీర్చుకుంటున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

 Msc Graduate Blackmailing Women In Social Media

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి ఓ యువకుడు సోషల్ మీడియాలో ఆరి తేరాడు.అయితే ఇతగాడు ప్రస్తుతం ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.

దీంతో సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తూ అమాయకపు ఆడపిల్లలకు కపట ప్రేమ సందేశాలు పంపుతూ వారిని బుట్టలో వేసుకున్నాడు.

అందంగా ఉన్నావని అంటాడు …. బుట్టలో  పడ్డారో ఇక అంతే…-Latest News-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతికి కూడా ఇదేవిధంగా ప్రేమ సందేశాలు పంపుతూ బుట్టలో వేసుకొని తన కామ వాంఛలను తీర్చాలని బ్లాక్ మెయిల్ చేయ సాగాడు.

దీంతో యువతి తన కుటుంబ పరువు, ప్రతిష్టల గురించి ఆలోచించి కిక్కురుమనకుండా ఉండిపోయింది.కాగా చివరికి ఎలాగోలా తన బంధువుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించింది.

ఇందులో భాగంగా యువకుడు ప్రేమ పేరుతో చేస్తున్నటువంటి ఆగడాల గురించి పోలీసులకు సమాచారం అందించింది.దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు నిందితుడి పక్కా ఆధారాలతో సహా పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.

అంతేకాక ముక్కు మొహం తెలియని వారితో సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రేమ మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Msc Graduate Arrested For Blackmailing To The Women In Social Media Related Telugu News,Photos/Pics,Images..