సమంత ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చని విషయం ఇదే

టాలీవుడ్‌లో కొత్తగా ఎంత మంది హీరోయిన్స్‌ వచ్చి అందాల ప్రదర్శణ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నా కూడా సమంతకు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సమంతపై తెలుగు వారికి మరింత అభిమానం పెరిగింది.

 Samantha Fans Request To Her Do More Films  Tollywood, Smanatha, O Baby, Samanth-TeluguStop.com

ఆమెను మరిన్ని సినిమాల్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.అయితే ఆమె మాత్రం సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గించింది.

పెళ్లికి ముందు ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు ఒప్పుకునే సమంత ఇప్పుడు మాత్రం ఆచి తూచి సినిమాలకు కమిట్‌ అవుతోంది.

గత ఏడాది ఓ బేబీ మరియు మజిలీ చిత్రాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు కొత్తగా ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు.

సినిమాలకు గుడ్‌ బై చెప్పిందా అంటే అదేం లేదంటున్నారు.ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేకపోవడంతో ఫ్యాన్స్‌ తీవ్ర నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.

సరే పెళ్లి అయ్యింది కనుక ఎక్కువ సినిమాలు చేయకున్నా పర్వాలేదు ఏడాదిలో కనీసం ఒక్కటి రెండు అయినా చేయవచ్చుగా అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Lock, Mazili, Baby, Samantha Fans, Smanatha, Tollywood-Movie

ఎప్పుడు సమంతను నెత్తిన పెట్టుకుని అభిమానిస్తున్నట్లుగా చెప్పే అభిమానులకు కూడా ఈ విషయమై వారికి నచ్చడం లేదట.సినిమాలకు కమిట్‌ కాకుండా ఉండటం వల్ల ఆమె ప్రేక్షకులకు మెల్లగా దూరం అవుతుందని, తద్వారా ఆమె కెరీర్‌ త్వరలోనే ముగిసి పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరో లేదా హీరోయిన్స్‌కు గ్యాప్‌ ఎక్కువ వస్తే ఖచ్చితంగా కెరీర్‌పై ప్రభావం పడుతుంది.

అందుకే ఎట్టి పరిస్థితుల్లోనే సమంత ఇంతకంటే ఎక్కువ గ్యాప్‌ రాకుండా లాక్‌ డౌన్‌ పూర్తి అయిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించాలని ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube